Rs 50,000 Reward: తప్పిపోయిన చిలుక.. పట్టుకున్న వారికి 50 వేలు బహుమతి?

ఈ మధ్యకాలంలో మనుషులు జంతువులతో పాటుగా పక్షులను కూడా పెంచుకోవడం మొదలుపెట్టారు. అయితే

  • Written By:
  • Publish Date - July 20, 2022 / 06:15 AM IST

ఈ మధ్యకాలంలో మనుషులు జంతువులతో పాటుగా పక్షులను కూడా పెంచుకోవడం మొదలుపెట్టారు. అయితే క్రమక్రమంగా ఈ పక్షులను పెంచుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే కొంతమంది అయితే టెక్నాలజీకి అనుగుణంగా ఆ పక్షులకు మనుషుల భాష అర్థం అయ్యే విధంగా మాట్లాడుతూ, ఆ పక్షులతో మాట్లాడించడం లాంటివి కూడా చేస్తున్నారు. కాగా ఇప్పటికీ ఎన్నో రకాల పక్షులు మానవుల మాదిరిగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే మనం పెంచుకుంటున్న పక్షులు కొన్ని బాగా స్వేచ్ఛకు అలవాటు పడితే బయట మొత్తం తిరిగి మళ్ళీ ఇంటికి చేరుతాయి.

కానీ కొన్ని పక్షులు మాత్రం ఛాన్స్ దొరికింది అంటే చాలు రివ్వున బయటికి ఎగిరిపోతూ ఉంటాయి. అటువంటి సమయంలో చాలామంది ఆ పక్షులను పెంచుకున్న యజమానులు చాలా బాధపడుతూ ఉంటారు. తాజాగా ఇలాంటి అనుభవమే ఒక యజమానికి ఎదురైంది. అయితే ఆ యజమాని కాస్త వినూత్నంగా ఆలోచించి తన దగ్గర నుంచి తప్పిపోయిన ఆ చిలుకను పట్టుకున్న వారికి డబ్బులు ఇస్తాను అంటూ బహుమతిని కూడా ప్రకటించాడు.. పూర్తి వివరాలలోకి వెళితే..కర్ణాటకలోని తుముకూరు కు చెందిన రవి అనే వ్యక్తి ఎంతో ముచ్చటపడి రెండు చిలుకలు పెంచుకుంటున్నాడు.

అయితే ఆ రెండు చిలుకలు ఆఫ్రికన్ గ్రే రకానికి చెందినవి. వాటికి రవి కుటుంబం పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహిస్తుంది. ఇప్పుడు వాటిలో ఒకటి ఎటో వెళ్లిపోయింది. తప్పిపోయిన ఆ చిలుక పేరు రుస్తుమా. ఎంతో ప్రేమగా పెంచుకునే చిలుకల్లో ఒకటి కనిపించకుండా పోవడంతో రవి కుటుంబం విచారంలో మునిగిపోయింది. ఈ నెల 16 నుంచి రుస్తుమా కనిపించకుండా పోయిందని దాంతో, రవి తన చిలుక ఆచూకీ తెలియజేసిన వారికి రూ.50 వేలు ఇస్తానంటూ ప్రకటన ఇచ్చాడు. చిలుక బొమ్మతో కూడిన పోస్టర్లను తాము నివసించే జయనగర్ కాలనీలోనే కాకుండా, పరిసర ప్రాంతాల్లోనూ అంటించాడు. ఆ చిలుకను తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తామని, ఇప్పుడది తమ వద్ద లేకపోవడం తీవ్రంగా బాధిస్తోందని రవి పేర్కొన్నాడు. అయితే ఈ ప్రకటనలను చూసి చాలామంది ఆశ్చర్యపోగా మరికొంతమంది బాధపడుతున్నారు. మొత్తానికి ఆ చిలక దొరికిన వారు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ చిలక ఆచూకీ తెలియజేసిన వారికి ఆ యజమాని 50 వేల రూపాయలు ఇస్తానని ప్రకటించాడు.