Site icon HashtagU Telugu

Tomato Price: మరింత దిగజారిపోయిన టమాటా ధర.. కిలో ధర తెలిసి గుండెలు బాదుకుంటున్న రైతన్నలు?

Tomato Prices Rise

Tomato Prices Rise

ప్రస్తుతం టమోటాల పరిస్థితి అలాగే టమోటాలను పండించిన రైతన్నల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అయితే నెల కిందటి వరకు టమోటా ధర ఒకసారిగా కిలో 300 రూపాయల వరకు పలకడంతో భయపడి పోయే టమోటాలను కొనుగోలు చేయాలి అంటే నేను భయపడిపోయారు. కొద్దిరోజులు దేశవ్యాప్తంగా ఆ విషయం గురించి ఎక్కడ చూసినా కూడా చర్చించుకున్నారు. ఇంస్టాగ్రామ్ లో రీల్స్ పెట్టడం లాంటివి కూడా చేశారు. కానీ టమాటా ధర ఒకసారిగా పాతాళానికి పడిపోయింది. కిలో టమాట 50 పైసలకు చేరింది.

దీంతో రైతన్నలు కన్నీరు మున్నీరుగా విడిపించడంతోపాటు గుండెలు బాదుకుంటున్నారు.. కొందరు టమోటాలను మార్కెట్ కు తెచ్చి వేస్ట్ అనుకొని రోడ్డు పక్కన కుప్పలు కుప్పలుగా పారేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో కొన్ని రోజులుగా కిలో టమాటా రూ.3..4 పలికింది. ఆదివారం మరింత పతనమై కిలో టమాటా 50పైసలకు చేరింది. మంచి దిగుబడి వచ్చే సమయంలో ధర పడిపోవడంతో టమాటా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంకా కొద్దిరోజులు కొనసాగితే రైతన్నలకు ఆత్మహత్యలు తప్ప మరొక మార్గం లేదని అంటున్నారు. పత్తికొండ ప్రాంతంలో ప్రతి రైతు ఏటా కనీసం అర ఎకరా నుంచి ఐదెకరాల వరకు సాగు చేస్తారు.

సెప్టెంబరులో అధిక మొత్తంలో సరకు వస్తుండటంతో ధరలపై తీవ్ర ప్రభావం పడింది. మంచి నాణ్యత ఉన్న టమాటాను సైతం వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోత కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే టమాటా రైతులకు అప్పులు తప్ప ఏమీ మిగలవని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనా కూడా టమోటా రైతులని ప్రభుత్వం ఆదుకోకపోవడంతో ఇప్పుడు రైతులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంట చేతికి వచ్చినా కూడా ఆ పంటను కోయేలా వద్దా అన్న ఆలోచనలో పడ్డారు.

Exit mobile version