Site icon HashtagU Telugu

UP Polls: యూపీలో ఐద‌వ ద‌శ ఎన్నిక‌లు.. 61 స్థానాల‌కు జ‌రుగుతున్న‌ పోలింగ్‌

yogi, priyanka, akhilesh, uttar pradesh

yogi, priyanka, akhilesh, uttar pradesh

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఐద‌వ ద‌శ పోలింగ్ ప్రారంభ‌మైంది. 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జ‌రుగుతుంది. ఈ స్థానాల్లో మొత్తం 692 మంది అభ్యర్థుల పోటీ చేస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అమేథీ, రాయ్‌బరేలి, అయోధ్య, సుల్తాన్‌పూర్, చిత్రకూట్, ప్రతాప్‌గఢ్, కౌశాంబి, ప్రయాగ్‌రాజ్, బారాబంకి, బహ్రైచ్, శ్రావస్తి, గోండా జిల్లాల్లో ఈ దశలో దాదాపు 2.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కౌశాంబి జిల్లాలోని సిరతు అసెంబ్లీ స్థానం నుంచి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పోటీ ఉన్నారు. మంత్రులు అలహాబాద్ వెస్ట్ నుండి సిద్ధార్థ్ నాథ్ సింగ్, పట్టి (ప్రతాప్‌గఢ్) నుండి రాజేంద్ర సింగ్, అలహాబాద్ సౌత్ నుండి నంద్ గోపాల్ గుప్తా నంది, మాన్కాపూర్ (గోండా) నుండి రమాపతి శాస్త్రి పోటీ లొ ఉన్నారు.