Site icon HashtagU Telugu

Ukraine: ఉక్రెయిన్ పై భీకర దాడి… ఒకేసారి 81 క్షిపణుల ప్రయోగం!

090323ukraine

090323ukraine

Ukraine: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ సమాజం వారించినప్పటికీ రష్యా ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని రష్యా నిపుణలు చెప్పుకొస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్, రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడిని ఉక్రెయిన్ నిలువరించలేకపోయింది. భారీగా క్షిపణుల ప్రయోగంతో, తీవ్రంగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

రోజు రోజుకు ఉక్రెయిన్ పై దాడిని పెంచుతోంది రష్యా. ఎలాగైనా ఓడించాలని పట్టుబిగిసింది. కానీ ఉక్రెయిన్ వీరోచితంగా పోరాడుతోంది. అయితే తాజాగా రష్యా భారీ ఎత్తున క్షిపణులు ప్రయోగించింది. పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించింది. ఒక్క రోజులో వివిధ నగరాలపై 81క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రక్షణశాఖ వెల్లడించింది.

ఇక జపోరిజియా అణు విద్యుత్తు కేంద్రానికి ఉక్రెయిన్ విద్యుత్తు వ్యవస్థకు మధ్య ఉన్న చివరి సంబంధం తెగిపోయింది. ఈ కేంద్రం వద్ద దాడి జరగడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని అణుకేంద్రం నిర్వహిస్తున్న ఎనర్గోఆటమ్ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. మాస్కో ఆధీనంలోని జపోరిజియా నగరంలోని రష్యా అధికారులు మాట్లాడుతూ ఈ అణు విద్యుత్తు కేంద్రానికి ఉక్రెయిన్ విద్యుత్తు సరఫరా నిలిపివేయడం కవ్వింపు చర్యే అని పేర్కొన్నారు. దీంతో ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాల్లో చీకట్లో మగ్గుతున్నాయి.

Exit mobile version