ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నందున మరోసారి వైద్య ఆరోగ్యశాఖ ఫీవర్ సర్వేను ప్రారంభించింది. ఈ ఫీవర్ సర్వేలో టీకాలు వేయని వ్యక్తులను గుర్తించి, వెంటనే వారికి టీకాలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఆరోగ్య కార్యకర్తలను కోరింది. రాష్ట్రంలో అర్హులైన వారిలో 98.96 శాతం మంది మొదటి డోస్ తీసుకోగా, 71.76 శాతం మందికి రెండో డోస్ వచ్చినట్లు ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. నెల్లూరు, విజయనగరం, ప్రకాశం, అనంతపురం, పశ్చిమగోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో మొదటి డోస్ టీకాలు 100 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.
AP:ఏపీలో కొనసాగుతున్న ఫీవర్ సర్వే..

file photo