బీజేపీ, వైస్సార్సీపీల (BJP Vs YSRCP) మధ్య వైరం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ పై ఏప్రిల్ ఒకటి నాడు అధికార పార్టీ నేతలు కొందరు సత్య కుమార్ పై చేసిన దాడిని బలహీన వర్గాలపై దాడిగా భావిస్తూ ఇప్పటికీ సోషల్ మీడియాలో కింద క్లిప్ ని సర్క్యూలేట్ చేసుకుంటున్నారు. స్తబ్దంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఇదొక ఆయుధంలా మారింది. అమరావతి రైతుల సంఘీభావం చెప్పడానికి వచ్చిన బీజేపీ నేతలు సత్య కుమార్, ఆదినారాయణ రెడ్డిలపై అధికార పార్టీ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే.
Also Read: Kiccha Sudeep: బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్న కన్నడ స్టార్ కిచ్చా సుదీప్
పోలీసుల సాయంతోనే ఉద్దేశపూర్వకంగానే తమపై దాడి చేశారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. దాడి ఘటన తర్వాత విజయవాడలో మడియాతో మాట్లాడిన ఆయన తుళ్లూరు నుంచి తాము విజయవాడకు వెళ్తున్న సమయంలో మందడం దగ్గర మూడు రాజధానుల శిబిరం దగ్గర పోలీసులు తమ కాన్వాయ్‌ను ఆపారని అన్నారు. ఎందుకు ఆపారని పోలీసుల్ని అడుగుతున్న సమయంలో వెనుక వైపు నుంచి వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారన్నారు.
పోలీసుల సహకారంతో ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా దాడి చేశారని సత్యకుమార్ ఆరోపించారు. ఈ దాడి పై డీఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కారుపై రాళ్లదాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. బీజేపీ నేతలపై దాడికి జగన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు హెచ్చరించారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపినట్లుగా ఆదినారాయణ రెడ్డిని చంపాలని ప్లాన్ చేశారని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు.
