Site icon HashtagU Telugu

Female Constable Suicide : పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ సూసైడ్

Female Constable Suicide

Female Constable Suicide

జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన మహిళా కానిస్టేబుల్ గగులోత్ నీల (Constable Gaguloth Neela) (26) క్షణికావేశంతో సూసైడ్ (Suicide ) చేసుకుంది. 2020లో ఆమెకు ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం వరంగల్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆమె, శనివారం విధులు ముగించుకుని స్వగ్రామానికి వచ్చింది.

Ukraine Partition : జర్మనీలా ఉక్రెయిన్‌ విభజన.. ట్రంప్ అనూహ్య ప్లాన్ ?!

ఇంటికి వచ్చిన నీల, కుటుంబ సభ్యులు లేని సమయంలో ఉరేసుకొని తనువు చాలించింది. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. గ్రామస్థులు, సహచరులు ఇది ఊహించని విషాదంగా అభివర్ణిస్తున్నారు.

నీల పెళ్లి సంబంధాలు (Wedding Matches ) కుదరకపోవడం వల్ల తీవ్రంగా మనస్తాపానికి గురై ఈ అఘటనకు పాల్పడినట్లు నీల తల్లి పోలీసులకు తెలిపింది. తమ కుమార్తె పెళ్లి విషయంలో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైందని బాధతో చెప్పారు. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీల మృతి కుటుంబానికి, స్నేహితులకు తీరని లోటుగా నిలిచింది.