Cheetah Dhatri: కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చిరుతల మరణాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. బుధవారం ఉదయం ఇక్కడ మరో చిరుత మృతి చెందింది.

Cheetah Dhatri: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చిరుతల మరణాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. బుధవారం ఉదయం ఇక్కడ మరో చిరుత మృతి చెందింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆడ చిరుత మృతిని ధృవీకరించారు. ఆడ చిరుత పేరు ధాత్రి. ఈ మేరకు కునో నేషనల్ పార్క్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆడ చిరుత మృతికి గల కారణాలను తెలుసుకోవడానికి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. కునో నేషనల్ పార్క్‌లో14 చిరుతలు ఉన్నాయి. అందులో 7 చిరుతలు మగ జాతికి చెందినవి కాగా, 6 ఆడ జాతికి చెందిన చిరుతలు. అందులో ఈ రోజు ఆడ చిరుత మృతి చెందింది. కునో వన్యప్రాణి వైద్య బృందం మరియు నమీబియా నిపుణులు చిరుతలను వాటి ఆరోగ్యం కోసం నిరంతరం పరీక్షిస్తున్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో తన పుట్టినరోజు సందర్భంగా పీఎం నరేంద్ర మోదీ స్వహస్తాలతో నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతలను కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఆ చిరుతలు కునో నేషనల్ పార్క్‌లోనే ఉంటాయని గతంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు.

Also Read: Ambati Rambabu ఫై జనసేన సినిమా.. ‘SSS – సందులో సంబరాల శ్యాంబాబు’ టైటిల్