Top News Today: ఈ రోజు ఫిబ్రవరి 5 ముఖ్యంశాలు

ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో నేడు అధికార జేఎమ్‌ఎమ్ పార్టీ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. హేమంత్ సోరెన్ తరువాత చంపయి సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Top News Today: జనసేన, టీడీపీ పార్టీల సీట్ల పంపకంపై క్లారిటీ వచ్చేసింది. ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంటు స్థానాలను జనసేనకు అప్పగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీనికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్టు సమాచారం.

తెలంగాణ షార్ట్ ఫామ్ టీఎస్ ని టిజిగా మార్చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ అని పిలిచేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టిజిగా నామకరణం చేయగా అది కాస్త టీఎస్ గా మార్చారు. ఇప్పుడు టీఎస్ కాస్త టిజిగా మారింది.

మాజీ సిఎం కెసిఆర్ మళ్లీ ప్రజల్లోకి రానున్నారు. నల్లగొండ జిల్లాలో కెసిఆర్ భారీ బహిరంగ సభ ఉండనున్నట్లు బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది. 2 లక్షల మందితో ఫిబ్రవరి మూడో వారంలో కెసిఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో నేడు అధికార జేఎమ్‌ఎమ్ పార్టీ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. హేమంత్ సోరెన్ తరువాత చంపయి సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై RBI చర్యలు తీసుకున్న నేపథ్యంలోనే పేటీఎం స్టాక్ పతనం మొదలైంది. శని, ఆదివారాలతో కాస్త బ్రేక్ వచ్చినా.. మళ్లీ సోమవారం సెషన్ ఆరంభమైన వెంటనే 10 శాతం లోయర్ సర్క్యూట్ కొట్టింది.

హైదరాబాద్ లో బస్సుల కొరతను తగ్గించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల మార్చి నుంచి 500ల ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకురానున్నట్టు తెలిపింది. అయితే ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండదు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.

విశ్వంభ‌ర‌ సినిమాలో హీరోయిన్‌గా త్రిష ఫిక్స‌యింది. విశ్వంభ‌ర సెట్స్‌లో త్రిష అడుగుపెట్టిన వీడియోను సోమ‌వారం చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

దేశంలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర 58,100 కాగా24 క్యారెట్ల బంగారం 63,380 వద్ద కొనసాగుతోంది. దేశంలో వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి 75,500 పలికింది.

Also Read: Papaya On Empty Stomach: ఖాళీ కడుపుతో బొప్పాయి పండు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?