Site icon HashtagU Telugu

FBI Raids : డొనాల్డ్ ట్రంప్ నివాసంలో ఫెడరల్ బ్యూరో అధికారుల సోదాలు

Donald Trump

Trump Imresizer

ఫ్లోరిడాలోని తన నివాసంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) దాడులు చేసిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని త‌న అందమైన ఇల్లు, మార్-ఎ-లాగో, ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఎఫ్‌బిఐ ఏజెంట్ల ముట్టడిలో ఉందని ట్రంప్ వెల్ల‌డించారు. అయితే ఈ సోదాల‌పై FBI , US జస్టిస్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దాడులు జరుగుతున్న సమయంలో మాజీ అధ్య‌క్షుడు ట్రంప్‌ తన ఇంట్లో లేర‌ని తెలుస్తోంది.

Exit mobile version