Site icon HashtagU Telugu

Bihar: తండ్రి అప్పు తీర్చలేదని మైనర్ కూతురిని పెళ్లాడిన 52 ఏళ్ల వ్యక్తి.. ఎక్కడో తెలుసా?

Bihar

Bihar

మామూలుగా అప్పు ఇచ్చిన వారు సమయానికి అప్పు కట్టకపోతే బెదిరించడం కొన్ని కొన్ని సార్లు గొడవ పడడం లాంటివి చేస్తూ ఉంటారు. ఏమి చేసినా అప్పు తీర్చకపోతే వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులను తీసుకెళ్లడం లేదంటే పోలీస్ కేసు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ బీహార్ లో మాత్రం ఒక వ్యక్తి తండ్రి అప్పు చేయలేదని ఏకంగా తనకంటే కొన్ని ఏళ్లు చిన్నదైన ఒక బాలికను పెళ్లి చేసుకున్నాడు. అసలేం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాలిక పుట్టింటివారు జార్ఖండ్‌లోని గోడ్డా జిల్లాలో ఉంటారు.

ఆ బాలిక తన తల్లి గత ఏడాది అనగా 2022 డిసెంబరులో మృతి చెందింది. దాంతో తన తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ బాలిక తండ్రి ఎక్కువగా అప్పులు చేయడంతో అప్పుల వారి నుంచి అప్పుల భారం ఎక్కువ అయింది. ఈ క్రమంలోనే ఆ బాలిక తండ్రికి రుణం ఇచ్చిన ఒక వ్యక్తి అప్పు తీర్చడానికి బదులుగా తన కుమార్తెతో తనకు వివాహం చేయాలని కోరాడట. దానికి ఆ బాలిక సవతి తల్లి కూడా ఓకే చెప్పడంతో కూతురికి ఇష్టం లేకపోయినా కూడా ఆ పదహారేళ్ల బాలికను 52 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశాడు ఆ కసాయి తండ్రి. అయితే పెళ్లి అయ్యాక ఆ భాగల్‌పూర్‌ చేరుకుంది. ఇక అంత చిన్న బాలికను పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఆ బాలికను హింసించి కొట్టడం నిందిస్తుండడం లాంటివి చేస్తూ వచ్చాడు.

బాలిక ఎంతకు లొంగక పోయేసరికి తుపాకి చూపించి మరి ఆ బాలికను ఆ శారీరకంగా సంబంధం ఏర్పరుచుకున్నాడట. అతని టార్చర్ భరించలేక సదరు బాలిక అవన్నీ కూడా ఒక వీడియో ద్వారా తెలిపి అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. భర్త తండ్రి పై ఫిర్యాదు చేయడానికి సదరుబాలిక మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా వారు ఎటువంటి సహాయం చేయకపోగా అది వారి పరిధిలోకి రాదని ఆమెని వెనక్కి పంపించేసారట. దీంతో బాధితురాలు డీఐజీ కార్యాలయానికి చేరుకుని, అక్కడి సిబ్బందికి తన ఆవేదన తెలియజేసినా వారు పట్టించుకోలేదు. దీంతో పూర్తిగా విసిగిపోయిన ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ ఒక వీడియో రూపొందించి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియో వైరల్‌ అయిన నేపధ్యంలో భాగల్‌పూర్‌ ఎస్పీ ఆనంద్‌ కుమార్ మాట్లాడుతూ కేసు దర్యాప్తు ప్రారంభించామని అన్నారు.