Karnataka: కన్న బిడ్డని కడతేర్చిన కసాయి తండ్రి

రెండో పెళ్లి చేసుకునేందుకు అడ్డంకిగా మారిన 14 నెలల చిన్నారిని కిరాతక తండ్రి అంతమొందించాడు. సభ్య సమాజం అసహ్యించుకునే ఘటన కర్ణాటకలోని రాయచూర్ లో చోటు చేసుకుంది

Published By: HashtagU Telugu Desk
Karnataka

New Web Story Copy 2023 09 05t182511.408

Karnataka: రెండో పెళ్లి చేసుకునేందుకు అడ్డంకిగా మారిన 14 నెలల చిన్నారిని కిరాతక తండ్రి అంతమొందించాడు. సభ్య సమాజం అసహ్యించుకునే ఘటన కర్ణాటకలోని రాయచూర్ లో చోటు చేసుకుంది. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటోందని, అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నానని నిందితుడు పోలీసులకు తెలిపాడు. నిందితుడిని లింగసుగూర్ తాలూకాలోని కనసవి గ్రామానికి చెందిన మహంతేష్ (32)గా గుర్తించారు. చనిపోయిన చిన్నారి పేరు అభినవ్. అంతకముందు చిన్నారి కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మహంతేష్‌పై అనుమానం వచ్చి విచారించారు. మొదట నిందితుడు తన బిడ్డ మృతదేహాన్ని కాల్చివేసినట్లు చెప్పాడు. అయితే ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత చిన్నారి మృతదేహాన్ని దాచి ఉంచిన స్థలాన్ని చూపించాడు . పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ముద్గల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Minister Errabelli: మదర్ థెరీసా సేవలు శ్లాఘనీయం: మంత్రి ఎర్రబెల్లి

  Last Updated: 05 Sep 2023, 06:26 PM IST