Floods: చెరువులా మారిన వీధి.. వసుదేవుడులా తన బిడ్డను ఎత్తుకొచ్చిన వ్యక్తి!

మహాభారతంలో వసుదేవుడు తన బిడ్డ శ్రీకృష్ణుడిని ఒక బుట్టలో పెట్టి నెత్తిన పెట్టుకొని సముద్రంలో నుంచి అవతలిగట్టు కు వెళ్ళిన ఘటన మనందరికీ ఉండే ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
Screenshot 2022 06 21 193335

Screenshot 2022 06 21 193335

మహాభారతంలో వసుదేవుడు తన బిడ్డ శ్రీకృష్ణుడిని ఒక బుట్టలో పెట్టి నెత్తిన పెట్టుకొని సముద్రంలో నుంచి అవతలిగట్టు కు వెళ్ళిన ఘటన మనందరికీ ఉండే ఉంటుంది. మనకు బాహుబలి సినిమా చూసినప్పుడు ఈ సంఘటన గుర్తుకు వస్తుంది. తాజాగా అలాంటి సంఘటనే అసోం లో చోటు చేసుకుంది. అసోంలో ప్రస్తుతం భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యి వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. రోడ్లు, వీధులు అన్నీ కూడా జలమయం అయ్యి చెరువులను తలపిస్తున్నాయి.

దీంతో అక్కడి ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. తాజాగా అసోం లోని సిల్చార్ లోని ఒక వీధి మొత్తం చెరువులా మారిపోయింది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక తండ్రి కొడుకును సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అనుకున్నాడు. అయితే అక్కడ నడుము లోతు వరకు నీళ్లు వస్తుండడంతో తన కొడుకుని ఒక బుట్టలో పెట్టి నీటిలో నుంచి జాగ్రత్తగా వీధిని దాటించాడు. అయితే ఆ నీటిలో నుంచి నడుస్తున్నప్పుడు అతను చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

అంతే కాకుండా ఆ యూజర్ శ్రీకృష్ణుడిని మోస్తూ యమునా నదిని దాటిన వాసుదేవతో పోలుస్తూ కామెంట్ కూడా చేశారు. ఈ వీడియో చూసిన మరొక నెటిజన్ ప్రతిరోజు ఫాదర్స్ డే అంటూ కామెంట్ చేశాడు. అంతే కాకుండా ఈ వీడియోని చూసిన నెటిజన్స్ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అసోంలో దారుణమైన వరదలను చవిచూస్తోంది. ఇప్పటికే వరదల కారణంగా 32 జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో వరదలు వల్ల కొండచరియలు విరిగి పడటంతో 80 మందికి పైగా మరణించారు.

  Last Updated: 21 Jun 2022, 08:42 PM IST