Bapatla Road Accident : ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు – కర్నూలు ప్రధాన రహదారిపై సంతమాగులూరు గవర్నమెంట్ హైస్కూల్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు.
Also read : Karnataka Teacher: ఇది మీ దేశం కాదు.. మీరు పాకిస్తాన్ వెళ్లండి.. ముస్లిం విద్యార్థులతో అమర్యాదగా ప్రవర్తించిన స్కూల్ టీచర్
ఏడుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను.. నరసరావుపేట నుంచి వినుకొండ రోడ్డు వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను గుంటూరులోని నల్లపాడుకు చెందిన కేటరింగ్ పనులు చేసే వారిగా గుర్తించారు. ఆటో మార్కాపురానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగిందని తేలింది. మృతదేహాలను (Bapatla Road Accident) ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.