Site icon HashtagU Telugu

Bus accident in Saudi Arabia : సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం…మంటలు చెలరేగి 20 మంది మృతి.

Saudi

Saudi

సౌదీ అరేబియాలో(Bus accident in Saudi Arabia) ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో వంతెనను ఢీకొట్టింది. వెంటనే బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్దమైందని సౌదీ అరేబియా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన ద్రుశ్యాలు సీసీటీవీలో నమోదు అయ్యాయి. యెమెన్‌ సరిహద్దులోని నైరుతి అసిర్‌ ప్రావిన్స్‌లో వాహనం బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.