Italy: ఇటలీలో ఘోర పడవ ప్రమాదం… 43 మంది మృతి!

ఇటలీ దేశంలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటలీ సముద్ర తీరంలో ఓ పడవ ధ్వంసమైంది. ఈ ఘటనలో 43 మంది వలసదారులు మృతి చెందారు.

Published By: HashtagU Telugu Desk
Migration Italy 98253767

Migration Italy 98253767

Italy: ఇటలీ దేశంలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటలీ సముద్ర తీరంలో ఓ పడవ ధ్వంసమైంది. ఈ ఘటనలో 43 మంది వలసదారులు మృతి చెందారు. దేశ దక్షిణ తీరంలో వారి మృతదేహాలు లభ్యమైనట్లు ఇటాలియన్ కోస్ట్‌గార్డ్ పేర్కొంది. ఇది చూసిన కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది కూడా ఒక్కసారిగా షాక్‌కు గరయ్యారు.

ఇటలీలో జరిగిన విషాద ఘటన యావత్తు ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తోంది. పొట్టచేతపట్టుకొని జీవితాన్ని సాగిద్దామని, సాహోసేపేతంగా వచ్చిన వలసదారులు పడవ ప్రమాదంలో చనిపోయారు. ఒకేసారి 43 మంది ప్రాణాలు కోల్పోవటంతో సగటు మనిషిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ మృతుల్లో నెలల వయస్సున్న ఓ శిశువు కూడా ఉందని తెలిపింది. ఇక్కడి కాలాబ్రియాలోని తీర ప్రాంత పట్టణం క్రోటోన్ సమీపంలో అయోనియన్ సముద్రంలో 120 మందికిపైగా వలసదారులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైనట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

కోస్ట్ గార్డ్, సరిహద్దు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరస్పర సమన్వయంతో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో దాదాపు 800 మంది ప్రాణాలతో బయటపడినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది తెలిపారు. ఇంకా అనేకమంది బాధితుల ఆచూకీ లభ్యం కాలేదని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ పడవలోని వలసదారులు ఎక్కడి నుంచి బయల్దేరారు.. ఏ దేశాలకు చెందినవారో తెలియరాలేదు. కాగా సాధారణంగా కాలాబ్రియాకు చేరుకునే వలస నౌకలు.. టర్కీ, ఈజిప్టు తీరాల నుంచి వస్తుంటాయి. ఇటీవల టర్కీలో పెను భూకంపం సంభవించి 45 వేల మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే. వీరంతా టర్కీ వలసదారులేనా అనేది తెలియాల్సి ఉంది.

  Last Updated: 26 Feb 2023, 09:33 PM IST