Site icon HashtagU Telugu

Siddipet Farmers:బ్యాంకు ఉద్యోగుల మోసాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసిన రైతులు

bank scam

bank scam

సిద్దిపేట యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగులు చేస్తున్న మోసాన్ని రైతులు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. సిద్దిపేట జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ బ్రాంచ్‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు బోగ‌స్ డాక్యెమెంట్లు సృష్టించి బ్రాంచ్ లో రుణాలు తీసుకున్న విష‌యాన్ని వెంకటరావుపేట గ్రామానికి చెందిన రైతులు బయటపెట్టారు. కొందరు బ్యాంకు అధికారులు, దళారులు చేతులు కలిపి పథకం పన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసులు,రైతులు తెలిపిన వివరాల ప్రకారం బ్రాంచ్ కి కొత్త మేనేజర్ వ‌చ్చిన‌ వెంటనే,
బ్యాంక్ నుండి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని ప‌లువురు రైతుల‌కు నోటీసులు పంపించారు. 2017 నుండి దాదాపు 80 మంది రైతుల నుండి బ్యాంకు నెలవారీ వాయిదాలను స్వీకరించడం లేదు. ఫలితంగా బ్యాంకు వీరికి నోటీసులు అందించింది. డిఫాల్ట్‌పై ఈ రైతులకు రైతు బంధు, ఆసరా ప్రయోజనాలను కూడా బ్యాంక్ సస్పెండ్ చేసింది. అయితే తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని సంబంధిత రైతులు అధికారులను ఆశ్రయించగా.. అధికారులు దరఖాస్తులు, వారందరి సంతకాలతో కూడిన ఇతర పత్రాలను వారికి చూపించారు. దీంతో కంగుతిన్న రైతులు ఇవి న‌కిలీ డాక్యుమెంట్ల అని ప‌సిగ‌ట్టి సిద్ధిపేట రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు.