Tomato Thieves: దేశంలో టమోటా ధరలు పెరుగుదల రైతుల పాలిట శాపంగా మారుతుంది. కస్టపడి పండించిన పంటను దుండగులు దొంగిలిస్తున్నారు. కిలో 150 ధర పలుకుతుండటంతో కొందరు దుండగులు పంటను దొంగిలిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు తమ పంటను కాపాడుకునే ప్రయత్నంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు.
మార్కెట్‌లో టమాట ధరలు విపరీతంగా పెరగడంతో కర్నాటక రైతులు తమ వ్యవసాయ భూముల్లో పండించిన పంటను దుండగులు దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు తమ పంటను కాపాడుకునే ప్రయతంలో రాత్రుళ్ళు పొలాల వద్ద పడుకోవలసి వస్తుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.తెల్లవారుజామున మరింత అప్రమత్తంగా ఉండాలని వారు చెప్తున్నారు. ఒక్క టమాటా పెట్టె రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు పలుకుతుండగా, మంచి పంట పండిన రైతులు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.
కొన్నేళ్లుగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఒకానొక సమయంలో టమాటా ధరలు బాగా పడిపోవడాన్ని నిరసిస్తూ వారు పంటను రోడ్లుపై పడేసిన సందర్భాలున్నాయి. రైతులు రవాణా ఖర్చులను సైతం పొందలేని పరిస్థితి.అయితే ప్రస్తుతం పండించిన పంటకు మంచి ధర పలుకుతున్న తరుణంలో తాము పండించిన పంటను చోరీకి గురి చేయడం ఆందోళనకు గురిచేస్తోంది. హాసన్ జిల్లాలోని తన పొలంలో రాత్రికి రాత్రే రూ.3 లక్షల విలువైన టమోటాలు చోరీకి గురయ్యాయని ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన జూలై 6న జరిగింది. రూ.3 లక్షల విలువైన 90 టమాట బాక్సులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వివరించారు.
Read More: Lions couple Disturbed : సింహాల జంట సంభోగానికి భంగం.. బాలుడిపై ఎటాక్