Site icon HashtagU Telugu

Harish Rao: కేసీఆర్ పాలనలో రైతుల పిల్లలు డాక్టర్లుగా మారుతున్నారు: మంత్రి హరీశ్ రావు

Harish Rao

Harish Rao

Harish Rao: తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవం సృష్టించిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు డబ్బు ఉన్న వారే వైద్యులని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులు, కూలీల పిల్లలు కూడా డాక్టర్లుగా మారుతున్నారని అన్నారు. సిద్దిపేటలో నిర్మించిన 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో అందుతున్న సేవలు సిద్దిపేటలో కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. సిద్దిపేటలోనే గుండె శస్త్రచికిత్సలు చేయవచ్చని తెలిపారు. రూ.15 కోట్లతో క్యాన్సర్ బ్లాక్ కు శంకుస్థాపన చేశామన్నారు.

ఆసుపత్రిలో 15 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయని తెలిపారు. నాలుగో అంతస్తులో 100 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశామన్నారు. 30 అత్యవసర పడకలు ఉన్నాయి. ఇకపై వైద్య సేవల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. సిద్దిపేటలో 40 డయాలసిస్ బెడ్లు పెంచుతున్నట్లు వెల్లడించారు. రూ.23 కోట్లతో సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాటు చేశామన్నారు. అన్ని రకాల వ్యాధులకు సిద్దిపేటలో ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్టాఫ్ నర్సులకు నర్సింగ్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించినట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Hi Nanna: తండ్రికూతురి సెంటిమెంట్.. హాయ్‌ నాన్న’ నుంచి ‘గాజు బొమ్మ’ సాంగ్‌ ప్రోమో