Site icon HashtagU Telugu

Farmer’s Letter: ఆత్మ‌హ‌త్య చేసుకుంటా.. అనుమ‌తి ఇవ్వండి : కేటీఆర్ కు యువరైతు లేఖ‌!

KTR

KTR

ఆత్మ‌హ‌త్య చేసుకుంటా అనుమ‌తి ఇవ్వండి అంటూ 25 ఏళ్ల యువ రైతు మంత్రి కేటీఆర్ కు లేఖ రాశాడు. ఈ లేఖ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న బి. టెక్ పట్టభద్రుడైన శ్రీను తన పొలాల్లోంచి అధికారులే గెంటేశారని, ఆ భూమి ప్రభుత్వానిదేనని చెప్పారన్నారు. 2010లో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పనులు ప్రారంభించి భూములు సేకరిస్తున్న నేపథ్యంలో జి.యడవెల్లి గ్రామంలోని తన పూర్వీకుల భూమిని అమ్మి ఆ కుటుంబం సర్వే నంబర్ 354లోని భూములను కొనుగోలు చేసింది.

అయితే అధికారులు మాత్రం ఆ భూమిని ఇప్పటికే సేకరించినట్లు చెబుతున్నారని బాధితుడు చెబుతున్నారు. భూసేకరణ పూర్తయితే, రెవెన్యూ శాఖ నాకు ఎందుకు పట్టా ఇచ్చింది..? 2016లో సమగ్ర భూ సర్వే తర్వాత డిజిటల్ పాస్‌బుక్ ఎందుకు జారీ చేసింది? అని లేఖలో పేర్కొన్నాడు. అధికారులు తమను ఖాళీ చేయించారని.. ఆ భూమిని పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు వినియోగిస్తున్నారని శ్రీను తల్లి చెబుతోంది. అయితే మంత్రి కేటీఆర్‌, కలెక్టర్‌, జిల్లా అధికారులు, అధికార పక్షం, ప్రతిపక్ష నేతలు కూడా ఈ విష‌యంపై స్పందించలేదని కనగల్‌కు చెందిన చొప్పరి శ్రీను జనవరి 19న ఆత్మ‌హ‌త్య‌కు అన‌మ‌తి ఇవ్వండి అంటూ రెండు పేజీల లేఖను మంత్రి కేటీఆర్‌, న‌ల్గొండ జిల్లా క‌లెక్ట‌ర్ ల‌కు రాశారు.