నేషనల్ క్రష్ గా పేరొందిన రష్మిక ఇటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ అంటూ తేడా లేకుండా చక్కర్లు కొడుతోంది. షూటింగ్స్ బిజీగా ఉన్న ఈబ్యూటీ దేశంలోని నగరాలన్నీ చుట్టేస్తోంది. అయితే ఇటీవల బాలీవుడ్ సెలబ్రిటీలు నిర్వహించే పార్టీలకు రష్మికను కూడా ఆహ్వానిస్తున్నారు. కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకకు హాజరైన కొద్దిమంది దక్షిణ భారత నటీమణులలో రష్మిక ఒకరు. షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ లాంటి వాళ్లు సైతం అటెండ్ అయ్యారు. అయితే ఆ ఇద్దరికి కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో సినీ అభిమానులు కంగారు పడుతున్నారు. పార్టీకి వెళ్లిన రష్మికకు కొవిడ్ పాజిటివ్ ఉండొచ్చని రష్మిక ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, క్వారంటైన్‌లో ఉండాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్, ఛార్మీ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. అయితే రష్మిక తన అభిమానుల పోస్టులపై ఇంకా రియాక్ట్ కాలేదు.
Fans Suggest: రష్మిక ఐసోలేషన్ లో ఉండండి ప్లీజ్!

Rashmika