Site icon HashtagU Telugu

RRR: సినిమా చూస్తూ.. అభిమాని మృతి

Rrr

Rrr

తెలుగు రాష్ట్రాల థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా సందడి నెలకొంది. ఉదయం నుంచే అభిమానులు బారులు తీరి తమ తమ అభిమాన హీరోలను చూసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో విషాదం నెలకొంది. SV మ్యాక్స్ థియేటర్లో ‘RRR’ సినిమా చూస్తూ… గుండెపోటుతో ఓ అభిమాని మృతి చెందాడు. సినిమా చూస్తూ.. అభిమాన హీరోల వీడియోలను చిత్రీకరిస్తూ అతడు కుప్పకూలినట్లు అతని స్నేహితులు వెల్లడించారు. చికిత్స నిమిత్తం అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.