Site icon HashtagU Telugu

Khairatabad Ganesh: నేటి నుంచే ఖైరతాబాద్ పంచముఖి లక్ష్మీగణపతి దర్శనం

Khairatabad 2022

Khairatabad 2022

ఖైరతాబాద్ ‘బడా గణేశ్’ను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇది శుభవార్తే. గణనాథుడిని దర్శించుకునేందుకు నేటి నుంచే భక్తులను అనుమతించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ప్రకటించారు. ఖైరతాబాద్ గణేశుడు ఈసారి ‘పంచముఖ లక్ష్మీగణపతి’గా దర్శనం ఇవ్వనున్నాడు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరికాసేపట్లో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అంతకుముందు ఈ ఉదయం పద్మశాలి సంఘం తరపున 50 అడుగుల జంధ్యం, కండువా, గరికమాల, పట్టువస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. కాగా, భక్తుల సౌకర్యార్థం ఈసారి స్వామివారి ప్రత్యేక పాదాలను ప్రధాన విగ్రహం సమీపంలో ఏర్పాటు చేశారు.