Famous Foods: ఆ దేశాలలో ఈ ఫుడ్స్ బాగా ఫేమస్.. ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే?

సాధారణంగా ఒక్కొక్క ప్రాంతం, ప్రదేశం ఒక్కో విషయంలో బాగా ఫేమస్ అవుతూ ఉంటుంది. ప్రదేశాలు తినే ఫుడ్ వల్ల ఫేమస్ అవుతే మరి కొన్ని ప్రదేశాలు షాపింగ్

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 04:38 PM IST

సాధారణంగా ఒక్కొక్క ప్రాంతం, ప్రదేశం ఒక్కో విషయంలో బాగా ఫేమస్ అవుతూ ఉంటుంది. ప్రదేశాలు తినే ఫుడ్ వల్ల ఫేమస్ అవుతే మరి కొన్ని ప్రదేశాలు షాపింగ్ లు, హాస్పిటల్స్ ఇలా రకరకాల వాటి వల్ల ఫేమస్ అవుతూ ఉంటాయి. అలా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని దేశాలు కొన్ని ఫుడ్డు వల్ల బాగా ఫేమస్ అయ్యాయి. మరి ఏ దేశంలో ఏ ఫుడ్ ఫేమసో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అమెరికాలో హామ్ బర్గర్ బాగా ఫేమస్. ఈ బర్గర్ ని రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో మాంసంతో పాటు టమోటా కీర జున్ను ఉల్లిపాయ ముక్కలు పెట్టి తయారు చేస్తారు.

అలాగే మెక్సికో లో టాకో అనే ఫుడ్ ఐటమ్ బాగా ఫేమస్. మొక్కజొన్న పిండితో తయారు చేసే చిన్న సైజు చపాతీలను మిక్సీకోలో టోర్టిల్లా అని పిలుస్తారు. వీటిని మడత పెట్టి మధ్యలో మాంసం లేదా కాయగూరలతో తయారుచేసిన కూరని నింపుతారు. అలాగే జపాన్ లో సుషీ అనే ఫుడ్ బాగా ఫేమస్. అక్కడ వెనిగర్ కలిపిన అన్నం ముద్దలు చేపలు కూరగాయలు, పండ్ల మొక్కలు పెట్టి దీనిని సర్వ్ చేస్తారు. దీనిని సాస్ లేదా సూప్ లో అద్దుకొని తినాలి. టర్కీలో కబాబ్స్ బాగా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా లభించే కబాబ్స్ పుట్టిల్లు టర్కీ అని చెప్పవచ్చు.

మాంసం ఇతర కూరగాయల ముక్కలకు మసాల కలిపి సన్నటి కర్ర లేదా ఇనుప చువ్వ గుచ్చి మంటపై కాలుస్తారు. ఇటలీలో పిజ్జా బాగా ఫేమస్. పిజ్జా అనే ప్రదేశాలలో లభించినప్పటికీ ఇటలీలో మతం ఫేమస్ పిజ్జాలు బాగా కనిపిస్తాయి. బిర్యాని ఇండియా అలాగే ఆఫ్గాన్ లో బాగా ఫేమస్. ఇండియాలో బిర్యాని కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్లో ఏ రాష్ట్రానికి వెళ్లినా కూడా స్పెషల్ స్పెషల్ గా బిర్యానీలు కనిపిస్తూ ఉంటాయి. మీట్ పై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఈ ఫుడ్ బాగా ఫేమస్. ఇది చూడడానికి పిజ్జా లేదంటే కజ్జికాయలు మాదిరిగా కనిపిస్తుంది. అందులో మాంసాన్ని నింపి విక్రయిస్తూ ఉంటారు. మలేషియాలో నాసి లెమన్ బాగా ఫేమస్. మలేషియాలో ఎక్కువగా అన్నమే ప్రధాన ఆహారం. కానీ కొబ్బరి పాలు పాండన్ ఆకులతో కలిపి ఆహారాన్ని వండుతారు. గ్రీస్ లో స్పనాకోపిటా అనే ఈ ఫుడ్ బాగా ఫేమస్. చూడడానికి కర్రీ ఎగ్ పఫ్ లాగా కనిపిస్తూ ఉంటుంది.