Site icon HashtagU Telugu

BRS Party: బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బిజెపి రామగుండం నేత కౌశిక్ హరి

Bjp And Trs

Bjp And Trs

రామగుండం నియోజకవర్గానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు కేటీ రామారావు హరీష్ రావు లతో భేటీ అయ్యారు. పార్టీ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రామగుండం స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఉన్నారు.

కాగా..త్వరలోనే రామగుండంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కౌశిక్ హరి తో సహా పలువురు బిజెపి సీనియర్ నాయకులు బిఆర్ఎస్ లోకి చేరనున్నారు. కాగా…సంఘటిత అసంఘటిత కార్మిక సంఘాల నాయకులుగా రామగుండం ప్రాంతంలో ప్రజాదరణ పొందిన నేతగా కౌశిక్ హరికి ప్రజల్లో మంచి పట్టు ఉన్నది. 2009లో పిఆర్పి నుంచి పోటీ చేయగా కేవలం 1200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రజల్లో పట్టు ఉన్న నేత కావడంతో కౌశిక్ హరి చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది.