విజయవాడలో ఒకే కుటుంబానికి చెందన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. దుర్గమ్మ దర్శనానికి వచ్చి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా..కృష్ణానదిలో దూకి తండ్రీ కొడుకు ఆత్మహత్యకు చేసుకున్నారు. వీరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నదిలో గల్లంతైన వారి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. అసులు ఈ కుటుంబం ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో తెలుసుకునే పనిలో విజయవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను పప్పుల సురేశ్(56), అతడి భార్య శ్రీలత(54), అఖిల్(28), ఆశిష్(22)గా పోలీసులు గుర్తించారు.
Suicide: బెజవాడలో ఫ్యామిలీ సూసైడ్ కలకలం..

Template (49) Copy