Site icon HashtagU Telugu

Hyderabad: పెట్రోలింగ్ డ్యూటీలో నిద్రపోతూ అడ్డంగా బుక్కైన పోలీస్…

Hyderabad

Hyderabad

Hyderabad: పెట్రోలింగ్ డ్యూటీలో లో ఉన్న ఓ పోలీస్ అధికారి ప్రభుత్వ వాహనంలో నిద్రపోతూ కెమెరాకు చిక్కాడు. డ్యూటీ చేయాల్సిన పోలీసులు వాహనాన్ని రోడ్డు పక్కన పార్క్ చేసి రిలాక్స్ అవ్వడంపై పై అధికారులు యాక్షన్ తీసుకున్నారు. సదరు అధికారి బాగోతంపై విచారణకు ఆదేశించారు. కాగా పోలీస్ నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు తలదించుకున్న పరిస్థితి.

హైదరాబాద్ లోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ గత రాత్రి డ్యూటీలో ఉండగా నిద్రపోతూ పట్టుబడ్డాడు. టిఎస్ 09 పిఎ 5460 నంబరు గల పెట్రోలింగ్ కారులో విధులు నిర్వహిస్తున్న ఫలక్‌నుమా పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పి రవికుమార్‌గా గుర్తించారు. కుమార్‌కు శుక్రవారం రాత్రి ఆ ప్రాంతంలో పెట్రోలింగ్-డ్యూటీ కేటాయించారు. ఈ క్రమంలో విధుల్ని గాలికొదిలేసి కారులో ఏసీ వేసుకుని డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాడు. అయితే కొందరు ఈ సన్నివేశాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు . ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

We’re now on WhatsAppClick to Join

ఫలక్‌నుమాలో ప్రత్యేకించి రాత్రిపూట దోపిడీ నేరాలు జరిగే అవకాశం ఉన్న సమయంలో డ్యూటీలో నిద్రపోవడంపై హైదరాబాద్‌లో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సామాన్యులు ఎలా బ్రతకాలి అంటూ నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు పట్టుబడ్డ పోలీస్ బాస్ పై విచారణకు ఆదేశించారు.

Also Read: Blue Sea Dragon and Blue Button : విశాఖ తీరంలో వింత జీవులు..తాకద్దంటూ హెచ్చరిస్తున్న నిపుణులు