Falaknuma Express Fire: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు నమూనాల సేకరణ పూర్తి

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాదంపై విచారణ ముమ్మరం చేశారు. భువనగిరి మండలం బోమ్మాయిపల్లి - పగిడిపల్లి మధ్యలో రైలు అగ్ని ప్రమాదానికి గురైంది.

Falaknuma Express Fire: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాదంపై విచారణ ముమ్మరం చేశారు. భువనగిరి మండలం బోమ్మాయిపల్లి – పగిడిపల్లి మధ్యలో రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ బెంగాల్ నుండి సికింద్రాబాద్ కు వెళ్తున్నది. కాగా ఇటీవల రైలు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటుంతుండటంతో అధికారులు సమస్యను సీరియస్ గా తీసుకున్నారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాదంపై విచారణలో భాగంగా శనివారం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు నమూనాల సేకరణను పోలీసులు పూర్తి చేశారు.

నల్గొండ రైల్వే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రమాదానికి సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక పరీక్షలో ఎస్ 4 బోగీలో విద్యుత్ తీగలు నాసిరకం కావడంతో అందులోని బాత్ రూం సమీపంలో మొదట పొగలు వచ్చినట్లు బృందం నిర్ధారించింది. సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నివేదిక వచ్చిన తర్వాతే అగ్నిప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలుస్తాయని వారు తెలిపారు. ఈ ఘటనలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్-4, ఎస్-5, ఎస్-6, ఎస్-7 బోగీలు ఆరు బోగీలు దగ్ధమయ్యాయి. పొగలు రావడంతో లోకో పైలట్ రైలును ఆపేశాడు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులంతా రైలు నుంచి పరుగులు తీశారు.

Read More: RS Praveen Kumar : సిర్పూర్ నుంచి పోటీ చేస్తా.. క్లారిటీ ఇచ్చిన ప్ర‌వీణ్ కుమార్‌