Falaknuma Express: ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

  • Written By:
  • Updated On - July 7, 2023 / 01:03 PM IST

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా రెండు బోగీల్లో మంటలు చెలరేగి దట్టంగా పొగలు అలముకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును అక్కడే నిలిపివేసి.. రెండు బోగీల్లోని ప్రయాణికులను దించేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. మంటల ధాటికి రెండు బోగీలు దగ్ధమైనట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందులోని ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇటీవల ఓ ఆగంతకుడు త్వరలోనే మరో రైలు ప్రమాదం జరుగుతుందని రైల్వే అధికారులకు లేఖ పంపిన నేపథ్యంలో.. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైలులో సాంకేతిక లోపం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమయానికి ప్రయాణికులను దింపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా..రైలులో సిగరెట్ తాగడమే ప్రమాదానికి కారణమైందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన గుజరాత్ హైకోర్టు!