TTD: టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు.. టికెట్లు బుక్ చేసేటప్పుడు జాగ్రత్త

: తిరుమల తిరుపతి దేవస్దానం పేరుతో అనేక నకిలీ వెబ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. కొంతమంది కేటుగాళ్లు నకిలీ వెబ్ సైట్లు సృష్టించి డబ్బులు కాజేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 23, 2023 / 09:53 PM IST

TTD: తిరుమల తిరుపతి దేవస్దానం పేరుతో అనేక నకిలీ వెబ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. కొంతమంది కేటుగాళ్లు నకిలీ వెబ్ సైట్లు సృష్టించి డబ్బులు కాజేస్తున్నారు. టీటీడీ పేరుతో నకిలీ వెబ్ సైట్లు క్రియేట్ చేసి దర్శనం టికెట్లు, అర్జిత సేవా టికెట్ల పేరుతో భక్తుల నుంచి అందినకాడికి దొచుకుంటున్నారు. చివరికి మోసపోయామని భక్తులు తెలుసుకునే లోపు జరిగాల్సిన నష్టం అంత జరుగుతోంది. దీనిపై టీటీడీకి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి.

భక్తుల ఫిర్యాదు మేరకు టీటీడీ రంగంలోకి దిగింది. నకిలీ వెబ్ సైట్లను గుర్తించి కొరడా ఝుళిపించింది. నకిలీ వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవడంలో భాగంగా తిరుపతి వన్ టౌన్ పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. టీటీడీ ఫిర్యాదులో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును ఏపీ సైబర్ సెల్ కు అప్పగించారు. దీంతో సైబల్ సెల్ అధికారులు నకిలీ వెబ్ సైట్లను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల 40కుపైగా నకిలీ వెబ్ సైట్ బయటపగా.. తాజాగా టీటీడీ పేరుతో ఉన్న మరో వెబ్ సైట్ ను గుర్తించారు. టికెట్లు బుక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని భక్తులకు టీటీడీ సూచించింది.

భక్తులు టికెట్లు బుక్ చేసేటప్పుడు నకిలీ వెబ్ సైట్ ఏదో అసలు వెబ్ సైట్ ఏదో చెక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. టీటీడీ మొబైల్ యాప్ టీటీడీ దేవస్థానం ద్వారా కూడా టికెట్లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ స్పష్టం చేసింది. నకిలీ వెబ్ సైట్ల విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. https ://tirupatibalaji.ap.gov.in/ అనేది అధికారిక వెబ్ సైట్ అని తెలిపింది.అయితే కొంతమంది టీటీడీ పేరుతోనే వెబ్ సైట్లు నకిలీవి సృష్టించి ఎంతోమందిని మోసం చేస్తున్నారు. దీంతో టీటీడీ ఎట్టకేలకు చర్యలు చేపట్టింది.