Fake Vaccination: ఫేక్ ‘టీకా’ సర్టిఫికెట్ ముఠా గుట్టురట్టు!

కరోనా నివారణలో వ్యాక్సిన్లదే ముఖ్యపాత్ర. అందుకే ప్రముఖ ఆలయాలు, టూరిస్టు ప్రాంతాలు, ఇతర గవర్నమెంట్ కార్యాయాలు వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లకే అనుమతినిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - January 29, 2022 / 02:32 PM IST

కరోనా నివారణలో వ్యాక్సిన్లదే ముఖ్యపాత్ర. అందుకే ప్రముఖ ఆలయాలు, టూరిస్టు ప్రాంతాలు, ఇతర గవర్నమెంట్ కార్యాయాలు వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లకే అనుమతినిస్తున్నాయి. అయితే కొంతమంది టీకాకు భయపడో, మరే ఇతర కారణాలో కానీ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఫలితంగా అలాంటివాళ్లకు టీకా సర్టిఫికెట్ కష్టంగా మారింది. ఇదే అవకాశంగా భావించి.. వ్యాక్సిన్ తీసుకోనివాళ్లను టార్గెట్ చేస్తూ ఓ ముఠా రెచ్చిపోతోంది. ఫేక్ టీకా సర్టిఫికెట్స్ మంజూరు చేస్తూ.. డబ్బులు దండుకుంటున్నాయి. ఈ ముఠా రెచ్చిపోతుండటంతో సైబరాబాద్ పోలీసులు నిఘా వేసి అరెస్ట్ చేశారు.

సైబరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న శుక్రవారం నకిలీ టీకా సర్టిఫికెట్ ముఠాను గుట్టురట్టు చేశారు. నకిలీ ఆర్టీపీసీఆర్ రిపోర్టులు, వ్యాక్సిన్ రిపోర్టులను విక్రయిస్తున్న రెండు ముఠాలను అరెస్టు చేశారు. ఈ ముఠాలు కోవిడ్-19 నెగిటివ్ రిపోర్టులు, టీకా తీసుకోని వ్యక్తులకు వ్యాక్సిన్ సర్టిఫికెట్లను అందిస్తున్నారని టాస్క్ ఫోర్స్ డీసీపీ తెలిపారు. వాళ్ల నుంచి మొత్తం 65 కోవిడ్-19 నెగిటివ్ రిపోర్టులు, 20 శాంపిల్స్ కిట్‌లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొవిడ్ కు సంబంధించి ఎలాంటి శాంపిల్స్ తీసుకోకుండానే వ్యాక్సిన్ సర్టిఫికెట్స్ అందిస్తున్నారు. ఇందుకుగానూ రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు వసూలు చేస్తున్నారు” అని DCP తెలిపారు. COVID-19 వ్యాక్సిన్ డోస్ తీసుకోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని నకిలీ టీకా ధృవీకరణ పత్రాన్ని విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.

నకిలీ COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్లను విక్రయించినందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన ముంబై పోలీసులు ఇలాంటి ముఠాను ఛేదించారు. ఒక్కో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌కు నిందితులు రూ.1500 చొప్పున వసూలు చేస్తున్నారు. COVID-19 టీకాలు తీసుకోని వ్యక్తులకు రిపోర్ట్స్ ను అధిక ధరలకు విక్రయించబడ్డాయి. గత నెలలో, మహారాష్ట్రలోని థానే జిల్లాలోని దైఘర్ పోలీసులు ఒక రాకెట్‌ను ఛేదించారు. టీకా సర్టిఫికేట్ ఇవ్వడానికి జనాల నుంచి రూ.1,000 నుండి రూ.1,500 వరకు వసూలు చేశారు.