Hyderabad Frauds: హైదరాబాద్‌లో నకిలీ స్టాక్ మార్కెట్ మోసాలు

హైదరాబాదీలు జర జాగ్రత్త. నగరంలో నకిలీ స్టాక్ మార్కెట్ మోసాలు విపరీతంగా పెరిగాయి. కష్టపడి సంపాదించిన డబ్బును చాలా ఈజీగా దోచుకుంటున్నారు. ఈ స్కామ్‌లు తరచుగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారు

Hyderabad Frauds: హైదరాబాదీలు జర జాగ్రత్త. నగరంలో నకిలీ స్టాక్ మార్కెట్ మోసాలు విపరీతంగా పెరిగాయి. కష్టపడి సంపాదించిన డబ్బును చాలా ఈజీగా దోచుకుంటున్నారు. ఈ స్కామ్‌లు తరచుగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సులభంగా లాభాలు వస్తాయని నమ్మించి నకిలీ యాప్‌లలో పెట్టుబడి పెట్టిస్తారు. ముందర డబ్బు అకౌంట్ లో వేస్తూ నమ్మిస్తారు. ఆ తర్వాత అసలు రంగు బయటపడుతుంది. దీని బారీన ఇప్పటికే వందలసంఖ్యలో బాధితులు మోసపోయారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని క్రైమ్స్ & సిట్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం నేరస్థులు సాధారణంగా టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టా గ్రామ్, మరియు ఫేస్బుక్ వంటి ఆన్‌లైన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బాధితులను లక్ష్యంగా చేసుకుంటారు. వారు ఉచిత స్టాక్ మార్కెట్ చిట్కాలు మరియు సలహాలను ఇస్తూ ఆకర్షణీయమైన ప్రకటనలతో బాధితులను నమ్మిస్తారని రంగనాథ్ తెలిపారు. ప్రారంభంలో బాధితుడి బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చని తెలిపారు.

ప్లాట్‌ఫారమ్ డ్యాష్‌బోర్డ్‌లో ప్రదర్శించబడే నకిలీ లాభాలను బాధితులకు చూపుతారు. ఈ లాభాలను విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఐడీ బ్లాక్ అయినట్లు చూపిస్తుంది. అంతేకాదు వివిధ పన్నులు మరియు పెనాల్టీలు పడ్డాయంటూ కొంత ఎమౌంట్ పే చేస్తే అకౌంట్ ఓపెన్ అవుతుంది అంటూ మళ్ళీ బాధితుడి వద్ద డబ్బులు గుంజుతారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ తరహా మోసాలు భారీ ఎత్తున జరుగుతున్నట్టు రంగనాథ్ పేర్కొన్నారు. యువకులు ఈ తరహా యాప్‌ లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Also Read: Trisha : త్రిష డబ్బుల కోసం ఓ ఎమ్మెల్యేతో రాత్రి గడిపింది – ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు