Fake Medicine : తెలంగాణలో నకిలీ మందుల కలకలం

ప్రముఖ కంపెనీల లేబుళ్లతో మెడికల్ షాపుల్లో నకిలీ మందులు అమ్ముతున్నట్లు రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీల్లో తేలింది. కాలం చెల్లిన మందులు, లైసెన్స్ ని షాపులతో పాటు కొన్ని మెడిసిన్లు అధిక ధరకు అమ్ముతున్నట్లు నిర్ధారించింది.

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 09:46 AM IST

ప్రముఖ కంపెనీల లేబుళ్లతో మెడికల్ షాపుల్లో నకిలీ మందులు అమ్ముతున్నట్లు రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీల్లో తేలింది. కాలం చెల్లిన మందులు, లైసెన్స్ ని షాపులతో పాటు కొన్ని మెడిసిన్లు అధిక ధరకు అమ్ముతున్నట్లు నిర్ధారించింది. ఇవి హిమాచల్, ఉత్తరాఖండ్ నుంచి వస్తున్నట్లు గుర్తించింది. అసలైనవేవో, కల్తీవేవో తెలియని దుస్థితి తెచ్చి.. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతూ షాపులు నడుపుతున్నారంది.

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గత డిసెంబర్‌లో దిల్‌సుఖ్‌నగర్‌లో నకిలీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించి, రూ.26,00,000 విలువైన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నివేదికల ప్రకారం, ట్రాక్న్ కొరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొరియర్ షిప్పింగ్ కంపెనీ ద్వారా హైదరాబాద్‌కు నకిలీ మందుల రవాణాకు సంబంధించిన సమాచారం DCA అధికారులకు అందింది. లిమిటెడ్ తదనంతరం, ప్రత్యేక బృందం దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్‌లోని కొరియర్ కార్యాలయాలపై దాడులు నిర్వహించి, 14.5 కిలోలు, 13.34 కిలోల బరువున్న రెండు పార్శిళ్లను కనుగొన్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి సభ్యులు అర్హత లేకున్నా వైద్యం చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ వైద్యుల కేంద్రాలను గురువారం తనిఖీ చేశారు. 8 మంది సభ్యులు వేరు వేరు బృందాలుగా ఏర్పడి.. ఐడీపీఎల్, చింతల్, షాపూర్ ప్రాంతాలలోని పలు కేంద్రాలల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తనిఖీల్లో రోగులను అడ్మిట్ చేసి ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ ఇస్తున్న వాళ్ళు కనిపించారని తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి సభ్యులు తెలిపారు. ఎన్నో రకాల శాస్త్ర పరికరాలు లభించాయి అని తెలిపారు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి సభ్యులు. తమకు తాము వైద్యులుగా చెప్పుకుంటూ.. బోర్డు పెట్టుకోవడమే కాక, వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి అర్హత లేని వారి వద్ద వైద్యం చేయించుకొని, తన ప్రాణాలను ప్రమాదంలో పెట్టకోవద్దని సూచించారు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి సభ్యులు.

తమ తనిఖీ నివేదికను మండలికి, అలాగే జిల్లా వైద్యాధికారికి అందించి, నకిలీ వైద్యుల కేంద్రాలను మూతబడేలా చేస్తామని తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి సభ్యులు చెప్పారు. నకిలీ వైద్యులపై తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చేస్తామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి సభ్యులు.

Read Also : India Head Coach: టీమిండియా కోచ్ ప‌ద‌విని తిరస్క‌రించిన జ‌స్టిన్ లాంగ‌ర్.. రీజ‌న్ ఇదే..!