Site icon HashtagU Telugu

Fake Currency : న‌కిలీ క‌రెన్సీ రాకెట్‌ని ఛేదించిన కోల్‌క‌తా పోలీసులు

Crime

Crime

న‌కిలీ క‌రెన్సీ రాకెట్‌ని కోల్‌క‌తా స్పెష‌ల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. కోల్‌కతాలోని టాప్సియా క్రాసింగ్ సమీపంలో నిర్వహిస్తున్న నకిలీ కరెన్సీ రాకెట్‌ను ముఠాని పోలీసులు ప‌ట్టుకున్నారు. రూ. 500 డినామినేషన్ గల 300 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ మొత్తం రూ.1,50,000.గా పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ స‌మాచారం ప్ర‌కారం.. స్పెషల్ టాస్క్ ఫోర్స్ శనివారం మాల్దా జిల్లాలోని కలియాచక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయాద్‌పూర్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల రకీముల్ స్క్‌ని అరెస్టు చేసింది. రకీముల్‌పై సెక్షన్‌ 120, 489B, 489C కింద పోలీసులు కేసు న‌మెదు చేశారు.