Fake Baba: ఫేక్ బాబా అరెస్ట్.. నగ్న ఫొటోలు లభ్యం

హైదరాబాద్ లో ఓ ఫేక్ బాబా అరెస్ట్ అయ్యాడు. అతని దగ్గర మహిళల న్యూడ్ ఫొటోలున్నాయి (Nude Pics)

  • Written By:
  • Updated On - December 5, 2022 / 03:25 PM IST

ఇంట్లో డబ్బుల వర్షం కురిపిస్తానని చెప్పి అమయాక మహిళలను మోసం చేస్తున్నాడు ఓ ఫేక్ బాబా (Fake Baba). మహిళలను మభ్యపెట్టి,  తనను తాను ‘బాబా’  (Fake Baba) అని పిలిచే మోసగాడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ లోని పాతబస్తీలో పట్టుబడ్డాడు. నిందితుడు సయ్యద్ హుస్సానీ ఆటోరిక్షా డ్రైవర్. కర్ణాటకలోని కల్బురగి (గుల్బర్గా). కర్ణాటకలోని బసవకల్యాణ్‌కు చెందిన హుస్సేని  15 రోజుల క్రితం హైదరాబాద్ లో అద్దెకు దిగాడు. మహిళలకు లక్షీ కటాక్షం ప్రసాదించేలా పూజలు చేస్తానని అమాయక మహిళలను మోసం చేస్తున్నాడు.

పూజల పేరుతో

అయితే పూజల పేరుతో మహిళలను వివస్త్రగా (Nude Pics) మారి ఫొటోలు తీసేవాడు. ఆ ఫొటోలతో మహిళలను బెదిరించేవాడు. దీంతో ఓ మహిళ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు హుస్సేనిని అదుపులోకి తీసుకున్నారు. హుస్సేనీ మొబైల్ నుంచి 470కి పైగా నగ్న చిత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. “అతను ఒక నకిలీ బాబా. అతనిపై బ్లాక్‌ మ్యాజిక్‌ చట్టం కింద కేసు నమోదు చేశాం’ అని ఫలక్‌నుమా డివిజన్‌ ​​ఏసీపీ (ACP) షేక్‌ జహంగీర్‌ తెలిపారు.

Also Read : SI kidnapped: మగ ఎస్ఐ ను కిడ్నాప్ చేసిన లేడీ కానిస్టేబుల్స్.. ఏం జరిగిందంటే!