ద ఒమిక్రాన్ వేరియంట్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ఈ మధ్యకాలంలో వైరల్‌గా మారింది. భూమి స్మశానంగా మారిన రోజు అని కూడా దానికి ట్యాగ్‌లైన్ పెట్టి ఉండటం గమనించవచ్చు. 1963లో విడుదలైన ఓ సినిమా పోస్టర్‌గా దాన్ని ప్రచారం చేస్తున్నారు. దీంతో.. కరోనా వైరస్ వ్యవహారమంతా అప్పట్లోనే ప్లాన్ చేశారంటూ కొంతమంది పోస్ట్‌లు పెడుతున్నారు. డైరక్టర్ రామ్‌గోపాల్ వర్మ కూడా ఇదే పోస్ట్ పెట్టడంతో వెంటనే వైరల్ అయిపోయింది
అయితే, 1974లో విడుదలైన Phase IV అనే సినిమా తాలూకు ఇమేజ్‌లతో దీన్ని ఫేక్ చేసినట్టు మా పరిశోధనలో తేలింది. బెకీ చీట్లే అనే ఐరిష్ డైరక్టర్ సరదాగా దీన్ని తయారుచేసినట్టు తెలిసింది. ద ఒమిక్రాన్ వేరియంట్ పేరుతో ఎలాంటి సినిమా విడుదల కాలేదు. ఇదే విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది.
https://twitter.com/BeckyCheatle/status/1464866651678117892
ఒమిక్రాన్ పేరుతో సినిమాలొచ్చాయా?
IMDb వెబ్‌సైట్‌లో దీని గురించి సెర్చ్ చేస్తే ఒమిక్రాన్ పేరుతో రెండు సినిమాలు రిలీజైనట్టు తెలుస్తోంది. 1963లో ఒకటి.. 2013లో “The Visitor from Planet Omicron”. పేరుతో మరో సినిమా వచ్చింది. అయితే, దీనికి ప్రస్తుతం నడస్తున్న పాండమిక్‌తో ఎలాంటి సంబంధం లేదు.
