Virat Kohli Test Retirement: రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన కొద్ది రోజులే అయ్యాయి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు (Virat Kohli Test Retirement) చెప్పే వార్తల కారణంగా చర్చలో నిలిచాడు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. విరాట్ రిటైర్మెంట్ గురించి BCCIకి తన సందేశాన్ని అందించాడు. విరాట్ కోహ్లీ నిజంగానే రిటైర్ అవుతాడా? అంటే సమాధానం అవుననే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఒక స్టేట్‌మెంట్ స్క్రీన్‌షాట్ విపరీతంగా షేర్ అవుతోంది. దానిలో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ వైరల్ క్లెయిమ్ నిజం ఏమిటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ BCCI మాట వినలేదు!
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. విరాట్ కోహ్లీని టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చమని బీసీసీఐ కోరింది. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఒక స్టేట్‌మెంట్ వైరల్ అవుతోంది. దానిలో విరాట్ కోహ్లీ చాలా ఆలోచించిన తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించినట్లు రాసి ఉంది. వైరల్ స్టేట్‌మెంట్ ప్రకారం,, అతను BCCI, కోచ్, సహచర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపాడు. అతను అభిమానుల నుంచి పొందిన మద్దతుకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు. కానీ విరాట్ నిజంగానే రిటైర్ అవుతున్నాడా? విరాట్ BCCI మాట వినలేదా అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న.
🚨VIRAT KOHLI HAS ANNOUNCED HIS RETIREMENT FROM TEST CRICKET🚨
THANK YOU FOR THE MEMORIES KING 🫡 pic.twitter.com/fnfTdVmFxF
— Mufaddal Vorah (@aaravaltt) May 11, 2025
విరాట్ కోహ్లీ నిజంగా రిటైర్ అయ్యాడా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టేట్‌మెంట్‌లో ఏమాత్రం నిజం లేదు. విరాట్ కోహ్లీ స్వయంగా టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయినట్లు ఎలాంటి స్టేట్‌మెంట్ జారీ చేయలేదు. అలాగే BCCI నుంచి కూడా ఇలాంటి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ స్టేట్‌మెంట్ పూర్తిగా నకిలీదని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ ఒకసారి చూస్తే అతను ఇప్పటివరకు 123 మ్యాచ్‌లలో 9,230 పరుగులు సాధించాడు. ఈ సమయంలో అతను 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు సాధించాడు.