Earth From Space: అంద‌మైన భూమి ఫోటో.. ఫేక్ పిక్చ‌ర్‌

భూమ్మీద సూర్యాస్త‌మ‌యం ఫోటో అంటూ స్పేస్ నుంచి తీసిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

  • Written By:
  • Updated On - February 10, 2022 / 03:10 PM IST

భూమ్మీద సూర్యాస్త‌మ‌యం ఫోటో అంటూ స్పేస్ నుంచి తీసిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

చాలామంది దీన్ని షేర్ చేస్తూ నాసా విడుద‌ల చేసిన ఫోటోగా పేర్కొంటున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా స‌హా చాలా సోష‌ల్ మీడియాల్లో ఈ ఫోటో క‌నిపిస్తోంది.

ఇది నిజంగా స్పేస్ నుంచి తీసిన ఫోటోనేనా? ఖ‌చ్చితంగా కాద‌ని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. ఇది ఒక కంప్యూట‌ర్ జ‌న‌రేటెడ్ ఫోటో. ఒక జ‌ర్మ‌న్ ఆర్టిస్ట్ దీన్ని సృష్టించాడు.

రివ‌ర్స్ సెర్చ్ ద్వారా 2021 సెప్టెంబ‌ర్ 22న ఓ రెడిట్ యూజ‌ర్ దీన్ని పోస్ట్ చేసిన‌ట్టు అర్ధ‌మ‌వుతోంది. CGI వీడియోలో ఇది ఒక ఫ్రేమ్ అని దాని కింద రాశారు. ఆ వీడియో లింక్ సైతం అక్క‌డ పోస్ట్ చేశారు.

స్టాక్ ఇమేజ్‌లు పోస్ట్ చేసే పాండ్5 అనే వెబ్‌సైట్ నుంచి దీన్ని తీసుకున్నారు. అటు నాసా కూడా ఇది తాము రిలీజ్ చేసిన పిక్చ‌ర్ కాద‌ని ప్ర‌క‌టించింది.