బిపిన్ రావ‌త్ ప్ర‌మాద దృశ్యాలు ఫేక్‌.?

డిసెంబ‌ర్ 8, 2021న సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ స‌హా 11 మంది ఘోర హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మృతిచెందారు. త‌మిళ‌నాడులోని కూనూరు స‌మీపంలో ఎయిర్‌ఫోర్స్ ఛాప‌ర్ క్రాష్ అవ‌డంతో ఆయ‌న చ‌నిపోయిన విష‌యం తెలిసిందే.

  • Written By:
  • Updated On - February 10, 2022 / 03:10 PM IST

డిసెంబ‌ర్ 8, 2021న సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ స‌హా 11 మంది ఘోర హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మృతిచెందారు. త‌మిళ‌నాడులోని కూనూరు స‌మీపంలో ఎయిర్‌ఫోర్స్ ఛాప‌ర్ క్రాష్ అవ‌డంతో ఆయ‌న చ‌నిపోయిన విష‌యం తెలిసిందే.

దేశం యావ‌త్తూ ఈ ఘ‌ట‌న‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. అయితే, బిపిన్ హెలికాఫ్ట‌ర్ ప్రమాదానికి సంబంధించిన వీడియో అంటూ ఒక వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ వీడియోను ఎంతోమంది ఘ‌ట‌న జ‌రిగిన కొన్ని గంట‌ల వ‌ర‌కు సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు.

అయితే, ఇది రావ‌త్ ప్ర‌మాదానికి సంబంధించిన వీడియో కాద‌ని తేలింది. 2020లో సిరియాలో రెబెల్స్‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య జ‌రిగిన పోరులో జ‌రిగిన ఘ‌ట‌న వీడియో అని తెలిసింది. అప్ప‌టి నుంచి ఇంట‌ర్నెట్‌లో ఈ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. 2020 ఫిబ్ర‌వ‌రి 11న ద టెలిగ్రాఫ్ ప‌త్రిక కూడా ఈ వీడియోను ఊటంకిస్తూ ఓ క‌ధ‌నాన్ని ప్ర‌చురించింది. అసోసియేటెడ్ ప్రెస్ సైతం పోస్ట్ చేసింది.

అయితే, దేశంలోని ఎన్నో ప్ర‌ముఖ ఛాన‌ళ్లు, ఇంట‌ర్నెట్ ప‌త్రిక‌లు ఇది బిపిన్ ప్ర‌మాద వీడియో అంటూ పాఠ‌కుల‌ను మిస్‌లీడ్ చేశాయి.