Site icon HashtagU Telugu

టైమ్ ‌జైన్ మార్ఫింగ్

టైమ్‌ మాగ‌జైన్ కు ఉన్న విలువ అంద‌రికీ తెలిసిందే. దాని క‌వ‌ర్ పేజీకి ఉన్న డిమాండ్ అనూహ్యం. అంత‌టి ప్రాముఖ్య ఉన్న క‌వ‌ర్ పేజీ డిజైన్ కూడా చాలా అందంగా చేస్తుంటారు. క‌వ‌ర్ పేజీ స్టోరీని బేస్ చేసుకుని చాలా మంది ఆక‌ర్షితుల‌వుతారు. పైగా ఆ స్టోరీకి ప్ర‌త్యేక‌మైన రీడ‌ర్స్ ఉంటారు. అలాంటి క్రేజ్ ఉన్న క‌వ‌ర్ పేజీ మీద మోడీ బొమ్మ దాని మీద డిలీట్ ఫాసిజ‌మ్ టైటిల్ ను ఉంచారు. ఆన్ లైన్ లో టైం మేగ‌జైన్ మోడీని వ్య‌తిరేకిస్తూ క‌వ‌ర్ పేజీ డిజైన్ అయింది. జ‌ర్న‌లిజంతో బాగా ప‌రిచ‌యం ఉన్న వాళ్లు మేగ‌జైన్ క‌వ‌ర్ పేజీ చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ మేగ‌జైన్ స్టాండ్ మారిందా? అనే అనుమానాల‌ను రాక‌పోలేదు. ప్ర‌ధాన మంత్రి మోడీ బొమ్మ‌తో డిలీట్ ఫాసిజ‌మ్ టైటిల్ అంటే మామూలు అంశం కాదు.

ఆన్ లైన్ లో బాగా ఆ క‌వ‌ర్ పేజీ స‌ర్కులేట్ అయింది. ఇండియా టుడేకు సంబంధించిన యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూం దృష్టికి వెళ్లింది. ఆ క‌వ‌ర్ పేజీని చూసిన ఏఎఫ్ డ‌బ్ల్యూఏ ఆశ్చ‌ర్య పోయింది. ఒరిజిన‌ల్ క‌వ‌ర్ పేజీకి, మార్ఫింగ్ చేశార‌ని గుర్తించింది. అప్ర‌మ‌త్త‌మై, ఒరిజిన‌ల్ క‌వ‌ర్ పేజీని, మార్ఫింగ్ దాన్ని ప‌క్క‌ప‌క్క‌నే పెడుతూ వినియోగ‌దార్ల‌కు జ‌రిగిన మోసాన్ని తెలియ‌చేసే ప్ర‌య‌త్నం చేసింది. ఒరిజ‌న‌ల్ క‌వ‌ర్ పేజీలో ఫేస్ బుక్ కో ఫౌండ‌ర్ జూక‌ర్ బర్గ్ బొమ్మ దానిపైన డిలీట్ ఫేస్ బుక్ టైటిల్ తో కూడిన డిజైన్.
జూక‌ర్ బ‌ర్గ్ బొమ్మ బ‌దులుగా మోడీ బొమ్మ‌ను పెట్టి మార్ఫింగ్ చేశారు. ఇక డిలీట్ ఫేస్ బుక్ బ‌దులుగా డిలీట్ ఫ్యాసిజ‌మ్ అని సేమ్ టూ సేమ్ ఫాంట్స్ ను ఉప‌యోగించి టైటిల్ ఉంది. సో..అది మార్ఫింగ్ అని తెలుసుకునే వ‌ర‌కు రీడ‌ర్ల‌కు, జ‌ర్న‌లిస్ట్ ల‌కు టైమ్స్ మేగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కిత‌కిత‌లు పెట్టింద‌న్న‌మాట‌.

Exit mobile version