Fact Check : న్యూజీలాండ్ టీమ్ ఫోటో కొత్త‌దేనా?

ఇవాళ‌( న‌వంబ‌ర్ 25) నుంచి న్యూజిలాండ్‌, ఇండియా ఫ‌స్ట్ టెస్ట్ జ‌ర‌గ‌బోతోంది. ఈ నేప‌ధ్యంలో నాలుగేళ్ల కింద‌టి ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

  • Written By:
  • Updated On - February 10, 2022 / 03:10 PM IST

ఇవాళ‌( న‌వంబ‌ర్ 25) నుంచి న్యూజిలాండ్‌, ఇండియా ఫ‌స్ట్ టెస్ట్ జ‌ర‌గ‌బోతోంది. ఈ నేప‌ధ్యంలో నాలుగేళ్ల కింద‌టి ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

న్యూజిలాండ్ టీమ్ ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ల్యాండ్ అవ‌గానే కాషాయ‌రంగు వేసుకుని ఉన్న ఫోటో సోష‌ల్‌మీడియాలో చెక్క‌ర్లు కొట్టింది. యోగీ రాజ్యంలో ఎలా వాళ్ల‌ను రిసీవ్ చేసుకున్నారో చూడండి అంటూ చాలామంది ఈ ఫోటోను షేర్ చేశారు. స‌మాజ్‌వాదీ పార్టీ దీన్ని అంగీక‌రించ‌డంలేద‌ని, నానా యాగీ చేస్తోందంటూ హిందీలో రాశారు.

అయితే, ఈ ఫోటోలో నిజం లేద‌ని మా ప‌రిశోధ‌న‌లో తేలింది. ఇది నాలుగేళ్ల కింద‌టి ఇమేజ్ అని తెలిసింది. ఫోటోలో ఎవ‌రూ మాస్క్‌లు వేసుకోలేదు. కాబ‌ట్టి ఇది క‌రోనాకి ముందు తీసిన ఫోటోనే.

ఇదే ఫోటోను రివ‌ర్స్ సెర్చ్ చేస్తే న‌వంబ‌ర్ 23వ తారీఖున ఓ పేప‌ర్‌లో క‌నిపించింది. కాన్‌పూర్‌లో ల్యాండ్ అయిన‌ప్ప‌టి ఫోటోగా ఆ ఆర్టిక‌ల్‌లో రాసి వుంది. అలానే అక్టోబ‌ర్ 27, 2017 తేదీన జీ న్యూస్‌లో రాసిన మ‌రో వార్త కూడా ఇదే ఫోటోతో క‌నిపించింది.ఏదో ఒక సీరిస్‌లోని మూడో వ‌న్‌డే కోసం కాన్పూర్ వ‌చ్చిన‌ప్పుడు తీసిన ఫోటోగా తేలింది.