ప్ర‌ధాని యూ ట్యూబ్ ఛాన‌ల్ సంచ‌ల‌నం.. ఈశ్వ‌ర్ అల్లా బ‌దులుగా జై శ్రీరాం, సీతారం పాట

మ‌హాత్మాగాంధీ వ‌ర్థంతి, జ‌యంతి సంద‌ర్భంగా పాడే ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం...భ‌జ‌న‌లోని `ఈశ్వ‌ర్ అల్లా తేరే నామ్ ..` బ‌దులుగా జై శ్రీరాం సీతారాం అంటూ బీజేపీ ఎంపీ హ‌న్స్ రాజ్ పాట‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

  • Written By:
  • Updated On - February 10, 2022 / 03:10 PM IST

మ‌హాత్మాగాంధీ వ‌ర్థంతి, జ‌యంతి సంద‌ర్భంగా పాడే ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం…భ‌జ‌న‌లోని `ఈశ్వ‌ర్ అల్లా తేరే నామ్ ..` బ‌దులుగా జై శ్రీరాం సీతారాం అంటూ బీజేపీ ఎంపీ హ‌న్స్ రాజ్ పాట‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. పైగా ఆ వీడియోను ప్ర‌ధాన మంత్రి ఆఫీస్ అధికారికంగా నిర్వ‌హిస్తోన్న యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేయ‌డం వివాదానికి దారితీసింది. మ‌హాత్మాగాంధీ 152వ జ‌యంతి అక్టోబ‌ర్ 2ను ప్ర‌పంచ అహింసా దినోత్స‌వంగా వ‌ర‌ల్డ్ మొత్తం జ‌రుపుకుంది. ఆ సంద‌ర్భంగా ఢిల్లీలో భార‌త‌ ప్ర‌భుత్వం ఈ వ‌ర్థింతిని ఘ‌నంగా నిర్వ‌హించింది. ఆ సంద‌ర్భంగా ఎంపీలు అంద‌రూ రఘుప‌తి రాఘ‌వ రాజారాం…ఈశ్వ‌ర్ అల్లా తేరే నామ్ భ‌జ‌న పాడారు. బీజేపీ ఎంపీ హాన్స్ రాజ్ మాత్రం ఈశ్వ‌ర్ అల్లా తేరేనామ్ బదులుగా జై శ్రీరాం సీతారం అంటూ పాడారు. ఆ వీడియోను య‌థాత‌దంగా పీఎంవో ఆధ్వ‌ర్యంలోని యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కూడా ఈ వీడియోను గ‌మ‌నించారు. మొత్తం మీద ఈశ్వ‌ర్ అల్లా తేరే నామ్ బ‌దులుగా జై శ్రీరాం, సీతా రాం అనే మ‌ర్చారు అంటూ ట్విట్ట‌ర్లో మోడీని ఉద్దేశించి ప‌లువురు ట్వీట్ చేశారు.


ప్రపంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ వీడియోలోని నిజానిజాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూం(ఏఎఫ్‌డ‌బ్ల్యూఏ) రంగంలోకి దిగింది. ఆ వీడియోలో బీజేపీ ఎంపీ హ‌న్స్ రాజ్ ..ఈశ్వ‌ర్ అల్లా తేరేనాం పాడిన‌ట్టు గుర్తించింది. అదే వీడియో ఆర్క‌వ్ వ‌ర్ష‌న్ తీసుకుని ప‌రిశీలిస్తే..ప్ర‌తి ఏడాది మ‌హాత్మాగాంధీ జ‌యంతి, జ‌న‌వ‌రి30న వ‌ర్థంతి సంద‌ర్భంగా ఈ భ‌జ‌న పా‌డిన వీడియోలు అనేకం ఉన్నాయి. ఈసారి చాలా మంది మాస్క్ లు పెట్టుకున్న వీడియో ఆధారంగా ..ఇది 152వ జ‌యంతి సంద‌ర్భంగా పాడిన భ‌జ‌న వీడియోగా గ‌మ‌నించారు.

 

కీ వ‌ర్డ్స్ ఆధారంగా ఎంపీ, సింగ‌ర్ హాన్సి రాజ్ ఈ ఏడాది అక్టోబ‌ర్ 4న లైవ్ లో పాడిన వీడియోగా గుర్తించారు. ఈ వీడియోకు పెట్టిన డిస్క్రిప్ష‌న్ ఆధారంగా గాంధీ 152వ జ‌యంతి సంద‌ర్భంగా పాడిన పాటకు సంబంధించిన వీడియోగా నిర్థారించారు. వీడియో నిడివిలోని 1.52 నిమిషాలు..2 నిమిషాల మ‌ధ్య జై శ్రీరాం అంటూ నాలుగు సార్లు ఎంపీ హ‌న్స్ పాడిన‌ట్టు విన్నారు. ఇదే వీడియోలో 2.38 నిమిషాలు, 3.18 నిమిషాల మ‌ధ్య ఈశ్వ‌ర్ అల్లా తేరేనాం స‌బ్ కో స‌న్మ‌తి దే భ‌గ‌వాన్ అంటూ హాన్స్ పాడిన‌ట్టు వార్ రూం గుర్తించింది. మొత్తం మీద వీడియోను ఎవ‌రో ఓవ‌ర్ ల్యాప్ చేసిన‌ట్టు నిర్థారించారు.