Fact Check : ఆమిర్ ఖాన్‌ మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నాడా?

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరియు అతని భార్య కిరణ్ రావు జులై 3, 2021న పరస్పర అంగీకారంతో తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కొద్ది సేపటికే అమీర్ ఖాన్, ఫాతిమా సైనా షేక్‌ల ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెగ షేర్ చేసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Sharku Facmain

Sharku Facmain

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరియు అతని భార్య కిరణ్ రావు జులై 3, 2021న పరస్పర అంగీకారంతో తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కొద్ది సేపటికే అమీర్ ఖాన్, ఫాతిమా సైనా షేక్‌ల ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెగ షేర్ చేసుకున్నారు.

అయితే, ఇప్ప‌టికీ వైర‌ల్ అవుతున్న ఈ ఫోటోలో నిజ‌మెంతో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశాం. అది ఫేక్ ఫోటో అని తేలింది. ఆమిర్ ఖాన్‌ మాజీ భార్య కిరణ్ రావుతో క‌లిసి ఉన్న ఫోటోని ఎవ‌రో మార్ఫింగ్ చేసిన‌ట్టు తెలిసింది. రివ‌ర్స్ ఇమేజ్ ద్వారా సెర్చ్ చేస్తే పింక్ విల్లా అనే బాలీవుడ్ వెబ్‌సైట్‌లో ఒరిజిన‌ల్ ఫోటో దొరికింది. ఆకాష్ అంబానీ, శ్లోకా మెహ‌తా ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫోటో అది.

  Last Updated: 10 Feb 2022, 03:10 PM IST