Rs 2000 Notes: రూ. 2000 నోట్లు ఉన్న‌వారికి ఆర్బీఐ సూచ‌న‌.. ఏప్రిల్ 1న ఆ ఛాన్స్ లేదు..!

బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 2024 కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 మొదటి రోజున రూ. 2000 నోట్ల (Rs 2000 Notes)ను మార్చుకునే లేదా డిపాజిట్ చేసే సదుపాయం తన ప్రాంతీయ కార్యాలయాల్లో అందుబాటులో ఉండదని ప్రకటించింది.

  • Written By:
  • Updated On - March 29, 2024 / 10:59 AM IST

Rs 2000 Notes: బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 2024 కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 మొదటి రోజున రూ. 2000 నోట్ల (Rs 2000 Notes)ను మార్చుకునే లేదా డిపాజిట్ చేసే సదుపాయం తన ప్రాంతీయ కార్యాలయాల్లో అందుబాటులో ఉండదని ప్రకటించింది. ఏప్రిల్ 1, 2024న తన 19 ఇష్యూ కార్యాలయాలు వార్షిక ఖాతాల కార్యకలాపాల ముగింపులో బిజీగా ఉంటాయని ఆ రోజున రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం జరగదని ఆర్‌బిఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 2, 2024 నుంచి రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని లేదా మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.

2000 రూపాయల నోట్ల మార్పిడి, డిపాజిట్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 28, 2024న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో సోమవారం ఏప్రిల్ 1, 2024న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ కార్యాలయాల్లో 2000 రూపాయల నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉండదని RBI తెలిపింది. ఆర్‌బీఐ కార్యకలాపాలు వార్షిక ఖాతాల ముగింపుతో అనుసంధానించబడతాయని, దీని కారణంగా రూ. 2000 నోట్లను మార్చుకునే లేదా డిపాజిట్ చేసే సౌకర్యం ఆ రోజు అందుబాటులో ఉండదని ఆర్‌బీఐ తెలిపింది.

Also Read: KTR Tweet: రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు,  జంప్‌ జిలానీలపై కేటీఆర్ ట్వీట్

గతంలో మార్చి 1, 2024న 2000 రూపాయల నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం 97.62 శాతం 2000 రూపాయల నోట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్‌కి తిరిగి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మే 19, 2023 న ఊహించని ప్రకటనలో RBI దేశం నుండి 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని ప్రకటించింది.

2000 రూపాయల నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకున్నప్పుడు మే 19, 2023న దేశంలో రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు చెలామణిలో ఉన్నాయని RBI తెలిపింది. ఫిబ్రవరి 29, 2024 నాటికి ఈ సంఖ్య రూ. 8470 కోట్లకు తగ్గింది. అంటే, మొత్తం రూ. 2000 నోట్లలో 97.62 శాతం RBIకి తిరిగి వచ్చాయి.

We’re now on WhatsApp : Click to Join