Social Media Apps Down : ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ డౌన్.. వేలాదిమంది అవస్థ

Social Media Apps Down : ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ లు సోమవారం రాత్రి చాలాసేపు మొరాయించాయి..

Published By: HashtagU Telugu Desk
Social Media Apps Down

Social Media Apps Down

Social Media Apps Down : ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ లు సోమవారం రాత్రి చాలాసేపు మొరాయించాయి..

దీనివల్ల ఎంతోమంది  సోషల్ మీడియా యూజర్స్ అసౌకర్యానికి గురయ్యారు.. 

అమెరికాలోని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వినియోగదారులకు ఈ చేదు అనుభవం ఎదురైంది.  

ఈవిషయాన్ని డౌన్‌ డిటెక్టర్.కామ్(Downdetector.com) వెల్లడించింది. 

Also read : Article 370 Abrogation : మూడేళ్ల 11 నెలల తర్వాత.. ఆర్టికల్ 370 రద్దు సవాల్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ

దాదాపు 13,000 మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నట్లుగా  నివేదించారని తెలిపింది. 

ఫేస్‌బుక్ ను యాక్సెస్  చేయడంలో దాదాపు 5,400 మంది ఇబ్బందిపడగా.. వాట్సాప్‌ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొన్నామని  1,870 మంది వినియోగదారులు రిపోర్ట్ చేశారని డౌన్‌ డిటెక్టర్.కామ్ పేర్కొంది. 

అయితే ఈ అంతరాయం వల్ల ఇంకా ఎక్కువమందికే ఇబ్బంది కలిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

  Last Updated: 11 Jul 2023, 07:45 AM IST