సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో నగరం జనం సొంతూళ్ల బాట పట్టనున్నారు. ఇప్పటికే రైళ్లు, ఆర్టీసీ బస్సుల సీట్ల రిజర్వేషన్ దాదాపుగా పూర్తి చేసుకున్నారు. ప్రతి పండుగకు రవాణా సౌకర్యాలు అంతంతమాత్రమే ఉండటంతో రైల్వే శాఖ మరిన్ని రైళ్లు నడపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో జనవరిలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
వివరాలు ఇవే
07067-07068 మచిలీపట్నం-కర్నూలు (జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు),
07455 నర్సాపూర్- సికింద్రాబాద్ (2వ తేదీ, 9వ తేదీ, 16వ తేదీ, 23వ తేదీ, 30వ తేదీ)
07456 సికింద్రాబాద్-విజయవాడ (3,10,17, 24, 31)
07577 మచిలీపట్నం-సికింద్రాబాద్ వయా ఖాజీపేట (2, 9, 16, 23, 30)
07578 సికింద్రాబాద్-మచిలీపట్నం వయా గుంటూరు (2, 9, 16, 23, 30)
07605 తిరుపతి-అకోలా (7, 14, 21, 28)
