Site icon HashtagU Telugu

Afghan Blast: ఆఫ్ఘానిస్థాన్ లో వరుస బాంబు పేలుళ్లు, 9 మంది మృతి!!

afghan blast

afghan blast

వరుస బాంబు పేలుళ్లతో ఆఫ్ఘానిస్తాన్ దద్దరిల్లిపోతోంది. తాజాగా ఉత్తర ఆప్ఘానిస్తాన్ లో గురువారం జరిగిన రెండు బాంబు పేలుళ్లలో 9మంది మరణించారు. మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ జంట పేలుళ్లు నిమిషాల వ్యవధిలోనే జరిగాయి. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్ ఏ షరీఫ్ రెండు వేర్వేరు వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరిగినట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే పేలుళ్ల కారణం ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని తాలిబన్ భద్రత దళాలు చుట్టుముట్టాయి.

షియా మైనార్టి హజారా జాతికి చెందినవారిని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా వారం కింద కుందూజ్ ఇమామ్ సాహిబ్ జిల్లాలోని ఓ ప్రార్థనా మందిరంలో బాంబు పేలిన ఘటనలో పిల్లలతో సహా 33మంది మరణించారు. ఈ దాడుల్లో ఐసీసీ పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.