Site icon HashtagU Telugu

Rohit Sharma: రోహిత్ ముంబై కెప్టెన్సీ వదిలేయ్

Kohli Rohit Sharma

Kohli Rohit Sharma

ఐపీఎల్ లో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌ జట్టు ఐపీఎల్‌-2022లో చెత్త ప్రదర్శన కనబరుస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోను ఓటమి చెంది పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికిప్పుడు కెప్టెన్సీని వదిలేయాలని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రముఖ కామెంటేటర్ సూచించాడు. వరుస ఓటముల తర్వాత రోహిత్ శర్మ సారథ్యంపై మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ సీజన్ లో జట్టును ముందుండి నడిపించడంలో రోహిత్ శర్మ విఫలమవుతున్నాడనీ చెప్పాడు..అలాగే ఈ సీజన్ లో అతని బ్యాటింగ్ సగటు , స్ట్రైక్‌రేట్‌ అంత గొప్పగా ఏమి లేవన్న మంజ్రేకర్ టీమిండియాకు ఆడేటప్పుడు మాత్రం రోహిత్ శర్మ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ఉంటాడనీ చెప్పుకొచ్చాడు. టీమిండియాకి ఆడేటప్పుడు రోహిత్ శర్మ.. జట్టు గురించి ఎక్కువగా ఆలోచించడనీ, ఐపీఎల్‌లో ఆడేటప్పుడు.. ముంబై ఇండియన్స్ జట్టు గురించి అతిగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందనీ విశ్లేషించాడు. ఈ కారణంగానే అతను స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడనీ అభిప్రాయ పడ్డాడు. అందుకే ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నట్లు…రోహిత్ శర్మ కూడా ఐపీఎల్ కెప్టెన్సీని వదిలేస్తే మంచిదన్నాడు. ముంబై ఇండియన్స్ సారథ్య భద్యతలను అనుభజ్ఞుడైన కిరాన్ పోలార్డ్ కి అందించాలనీ , అప్పుడు రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయొచ్చని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.ఇదిలాఉంటే.. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన సారథిగా పేరుగాంచిన రోహిత్ శర్మ ఇప్పటికే ముంబయి ఇండియన్స్ జట్టుని ఐదు సార్లు టైటిల్ విన్నర్ గా నిలిపాడు. కానీ హిట్ మ్యాన్ బ్యాటర్‌గా మాత్రం గత కొన్ని సీజన్లుగా రాణించలేకపోతున్నాడు.. ఈ క్రమంలోనే అతను కెప్టెన్సీ వదిలేసి బ్యాటింగ్ పై దృష్టిసారించాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.

Exit mobile version