TS Liquor: తెలంగాణ‌లో మ‌ద్యం విక్ర‌యాల్లో ఆ జిల్లానే టాప్‌…?

తెలంగాణ‌లో 2021-2022 ఆర్థిక సంవ‌త్స‌రంలో మ‌ద్యం విక్ర‌యాలు జోరుగా సాగాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో అత్య‌ధికంగా మ‌ద్యం విక్ర‌యాలు జ‌రిగాయి. గ‌త ఏడాదితో పోలిస్తే ఈ జిల్లాలో 92 కోట్ల రూపాయాల మ‌ద్యం అద‌నంగా సేల్స్ అయింది.

  • Written By:
  • Publish Date - April 3, 2022 / 11:00 AM IST

తెలంగాణ‌లో 2021-2022 ఆర్థిక సంవ‌త్స‌రంలో మ‌ద్యం విక్ర‌యాలు జోరుగా సాగాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో అత్య‌ధికంగా మ‌ద్యం విక్ర‌యాలు జ‌రిగాయి. గ‌త ఏడాదితో పోలిస్తే ఈ జిల్లాలో 92 కోట్ల రూపాయాల మ‌ద్యం అద‌నంగా సేల్స్ అయింది. 2021-22లో రూ.2169 కోట్ల మద్యం అమ్మకాలు జ‌రిగాయి. ఇందుకు కార‌ణం ఏపీలో మ‌ద్యం రేట్లు అధికంగా ఉండ‌టంతో పాటు ఆ రాష్ట్రంలో కోత్త బ్రాండ్స్ రావ‌డంతో చాలామంది తెలంగాణలోని షాపుల్లో కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 200 వరకు ఉన్న బెల్ట్ షాపులు మంచి విక్రయాలు జరిపి తెలంగాణ ప్రభుత్వానికి భారీగా సొమ్మును రాబట్టాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ మద్యం షాపుల్లో అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచలేదు. దీంతో సరిహద్దు మండలాలైన నేలకొండల్లి, ముదిగొండ, చింతకాని, బోనకల్, కల్లూరు, మధిర, ఎర్రుపాలెం, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు, దమ్మపేట్, అశ్వారావుపేట, చండ్రుగొండ, బూర్గుంపహడ్ర, ములకలపల్లి, ములకలపల్లి, ములకలపల్లి, ములకలపల్లి మండలాల్లోని బెల్టుషాపులను ఏపీ మ‌ద్యం ప్రియులు ఆశ్ర‌యించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వనరుగా రూపుదిద్దుకున్న బెల్టుషాపుల కారణంగా మారుమూల గ్రామాల్లో సైతం మద్యం ప్రతి వీధిలో అందుబాటులోకి వచ్చింది. 2021-22లో దాదాపు 12.21 లక్షల బీర్ కేసులు, 31.91 లక్షల ఇండియన్ మేడ్ లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం మద్యం విక్రయాలతో మద్యం వ్యాపారులు, బెల్ట్ షాపు నిర్వాహకులు రూ.500 కోట్ల లాభం పొందారు. బెల్టు షాపుల్లో ఒక్కో బ్రాండ్‌ను ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించారు. మద్యం షాపు యజమానికి మద్యం వ్యాపారంలో 15 నుంచి 30 శాతం లాభం వస్తుంది. మద్యం విక్రయాలు పెరిగితే మరింత లాభం వస్తుందని మ‌ద్యం వ్యాపారులు అంటున్నారు.