Imran Khan-3 Years Prison : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ళ జైలుశిక్ష విధిస్తూ పాకిస్తాన్ లోని ఓ కోర్టు శనివారం తీర్పు ఇచ్చింది.
ఇమ్రాన్ పై నమోదైన తోషాఖానా కేసును విచారించిన కోర్టు ఈమేరకు తీర్పు వినిపించింది.
ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఖరీదైన ప్రభుత్వ బహుమతులను విక్రయించి వ్యక్తిగతంగా లబ్ధి పొందారనే అభియోగాలు నమోదయ్యాయి. దీన్నే తోషాఖానా కేసు అని అంటారు. ఇందులో ఇమ్రాన్ ను దోషిగా తేల్చిన కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది.
ఈ తీర్పు వెలువడిన వెంటనే ఇమ్రాన్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని కథనాలు వచ్చాయి.
Also read : Cyber Criminals: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు, 3000 మందిపై కేసులు బుక్
ఇమ్రాన్ ఖాన్ 2018 నుంచి 2022 మధ్యకాలంలో పాక్ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ వ్యవధిలో విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆయనకు అధికారికంగా ఎన్నో గిఫ్ట్స్ వచ్చాయి.. విదేశాల నుంచి పాక్ కు వచ్చిన గెస్ట్ లు ఇమ్రాన్ కు అధికారికంగా ఎన్నోగిఫ్ట్స్ ఇచ్చారు. ఇలా అందిన దాదాపు రూ.6 కోట్లు విలువైన గిఫ్ట్స్ ను ఆయన వ్యక్తిగత అవసరాల కోసం అమ్మేశారనే అభియోగాలు ఇమ్రాన్ పై నమోదయ్యాయి. ఇమ్రాన్ కూడా విదేశీ అతిథులకు ఇచ్చేటందుకు ప్రభుత్వ ఖజానాలోని డబ్బులతో ఎన్నో గిఫ్ట్స్ కొన్నారు. వీటి కొనుగోలులోనూ ఇమ్రాన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని అభియోగాల్లో ప్రస్తావించారు.